
బంగారం ధరలు ఒక్కసారిగా మారాయి. కొన్ని గంటల్లోనే గోల్డ్, వెండి ధరలు తారుమారు అయ్యాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. శనివారం కూడా అదే పెరుగుదుల నమోదైంది.

శుక్రవారంతో పోలిస్తే శనివారం ఏకంగా రూ.వెయ్యిపైన బంగారం రేట్లు పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రాములు 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,460 వద్ద కొనసాగుతుండగా.. నిన్న ఈ ధర రూ.1,39,310గా ఉంది. నిన్నటితో పోలిస్తే శనివారం రూ.1150 పెరిగింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,28,750 వద్ద కొనసాగుతోంది.

నిన్న హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,27,700గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.1050 పెరిగింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో బంగారం ధరలో కాస్త మార్పులు చోటుచేసుకున్నాయి. స్వల్పంగానే చెన్నైలో పెరిగింది.

శనివారం చెన్నైలో 24 క్యారెట్ల ఫ్యూర్ బంగారం ధర రూ.1,39,650గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,39,640 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూ.10 పెరిగింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,29,000గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,28,000 వద్ద స్థిరపడింది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,460 వద్ద కొనసాగుతోంది.

ఇక బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2,49,000వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే శనివారం వెండి ధర రూ.11 వేలు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి ధరపై రూ.7 వేలు పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,75,000 వద్ద కొనసాగుతోంది.