
గాడ్జెట్లు మన జీవితాన్ని సులభతరం చేయడంలో సహాయపడతాయి. ఈ రోజు మనం ఇంట్లో ఉపయోగించే కొన్ని చౌకైన గాడ్జెట్ల గురించి తెలుసుకుందాం. ఇవి రోజువారీ అవసరాలను తీర్చడంలో ఉపయోగపడతాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో రూ. 100 కంటే తక్కువ ధరకు మీకు ఏ గాడ్జెట్‌లు లభిస్తాయో తెలుసుకుందాం..

తిరిగి వ్రాయగల టాబ్లెట్ ప్యాడ్: మీ బిడ్డ చిన్నగా ఉండి, ఫోన్ ఇవ్వడంలో ఇబ్బందిగా ఉంటే మీరు మీ బిడ్డ కోసం రూ. 99 కి తిరిగి రాసే టాబ్లెట్ ప్యాడ్‌ను కొనుగోలు చేయవచ్చు. పిల్లలు ఈ టాబ్లెట్‌లో ఏదైనా గీయవచ్చు. ఏదైనా రాయవచ్చు. అలాగే రాసిన తర్వాత దానిని ఎరేజర్ బటన్ సహాయంతో దానిని సులభంగా తొలగించవచ్చు.

LED నైట్ లైట్: అమెజాన్‌లో 58% తగ్గింపు తర్వాత USB LED లైట్ కేవలం రూ.79కి కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ USB LED లైట్‌ను ల్యాప్‌టాప్, కంప్యూటర్, ఛార్జర్‌కి కనెక్ట్ చేయడం ద్వారా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు పని చేస్తున్నప్పుడు లైట్ ఆరిపోయిందని అనుకుందాం. ఈ లైట్‌ను మీ ల్యాప్‌టాప్ USB పోర్ట్‌లోకి ప్లగ్ చేయడం ద్వారా మీరు పని కొనసాగించవచ్చు.

డ్రై ఫ్రూట్ కట్టర్: వంటగదిలో మీ పనిని సులభతరం చేసే ఈ గాడ్జెట్. డ్రై ఫ్రూట్స్‌ను కోయడంలో మీకు సహాయపడుతుంది. JustLatest కంపెనీ డ్రై ఫ్రూట్ కట్టర్ అమెజాన్‌లో 70% తగ్గింపు తర్వాత కేవలం రూ. 59 కి అమ్ముడవుతోంది.

హలోనిక్స్ బల్బ్: బల్బు కూడా ఒక రకమైన గాడ్జెట్. ఇది మీ ఇంటి అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. మీరు ఇంటికి బ్రాండెడ్, వారంటీతో వచ్చే చౌకైన బల్బు కావాలనుకుంటే మీరు అమెజాన్‌లో రూ. 100 కంటే తక్కువ ధరకు హాలోనిక్స్ కంపెనీ బల్బును కొనుగోలు చేయవచ్చు. ఈ బల్బును 50 శాతం తగ్గింపుతో అంటే అంటే సగం ధరకు, కేవలం రూ. 79కే విక్రయిస్తున్నారు. మీరు ఈ బల్బును 1 సంవత్సరం వారంటీతో పొందుతారు.