దీనితో పాటు, గూర్ఖా కొత్త 5-డోర్ వెర్షన్ 3-డోర్ వెర్షన్ కంటే 425 మిమీ అదనపు పొడవుతో మెరుగైన ఇంటీరియర్ కలిగి ఉంది. స్టాండర్డ్‌గా అనేక ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. కొత్త కారులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్డ్ రియర్ వ్యూ మిర్రర్స్, సర్దుబాటు చేయగల టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, వెనుక కెమెరా, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఫోర్స్ మోటార్స్ కొత్త గూర్ఖాలో భద్రతకు కూడా ప్రాధాన్యతనిచ్చింది. కొత్త కారుకు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన పూర్తి మెటల్ బాడీ, EBDతో కూడిన ABS, పూర్తి LED హెడ్ ల్యాంప్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఫీచర్‌గా అందించింది.