Aadhaar: మీ ఆధార్‌ మిస్‌ యూజ్‌ అయిందేమో అనే సందేహమా.? ఇలా చెక్‌ చేసుకోండి.

|

Jan 23, 2024 | 10:31 PM

ప్రస్తుతం ఆధార్‌ కార్డ్‌ అనివార్యంగా మారిపోయింది. ముఖ్యమైన గుర్తింపు కార్డుల్లో ఒకటిగా ఆధార్‌ మారింది. సిమ్‌ కార్డ్‌ మొదలు ల్యాండ్‌ రిజిస్ట్రేషన్ వరకు అన్నింటికి ఆధార్‌ కార్డ్‌ ఉండాల్సిందే. ఆధార్‌ కార్డ్ తప్పనిసరి కావడంతో ఎక్కడ పడితే అక్కడ ఆధార్‌ జిరాక్స్‌లు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇంతకీ మీ ఆధార్‌ను ఎక్కడెక్కడ ఉపయోగించారో ఎలా తెలుసుకోవాలంటే..

1 / 5
ఆన్‌లైన్‌లో పెరుగుతోన్న మోసాల కారణంగా ఆధార్‌ కార్డ్‌ సైతం దుర్వినియోగానికి గురైన సంఘటనలు అడపాదడపా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఇంతకీ మన ఆధార్‌ కార్డ్‌ ఎంత వరకు భద్రంగా ఉందో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది.

2 / 5
ఆధార్‌ కార్డును ఎక్కడెక్కడ ఎందుకు ఉపయోగించామో తెలుసుకుంటే. మన ఆధార్‌ కార్డ్‌ భద్రతపై ఓ క్లారిటీ వస్తుంది. ఆధార్‌ కార్డ్‌ ఎక్కడ ఉపయోగించారో తెలుసుకోవడానికి కూడా ఓ ఆప్షన్‌ అందుబాటులో ఉంది.

3 / 5
ఇందుకోసం ముందుగా అధికారిక యూఐడీఏ https://uidai.gov.in పోర్టల్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం మై ఆధార్‌ సెక్షన్‌లోకి వెళ్లి ఆధార్‌ సర్వీసెస్‌ను ఎంపిక చేసుకోవాలి. తర్వాత ఆధార్‌ సర్వీస్‌ సెక్షన్‌లో 8వ వరుసలో కనిపించే ఆధార్‌ అథెంటికేషన్‌ హిస్టరీపై క్లిక్‌ చేయాలి.

4 / 5
మీ ఆధార్‌ నెంబర్‌తో పాటు పాటు క్యాప్చా ఎంటర్‌ చేసి సెండ్‌ ఓటీపీపై క్లిక్‌ చేయాలి. ఎప్పటి నుంచి హిస్టరీ కావాలో సెలక్ట్‌ చేసుకొని తేదీ, నెల, సంత్సరం ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్‌కు లింక్‌ అయి ఉన్న ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. తర్వాత దానిని ఎంటర్‌ చేయాలి.

5 / 5
దీంతో మీరు ఆధార్‌ కార్డును ఏ సమయంలో ఎక్కడ ఉపయోగించారో పూర్తి వివరాలు తెలిసిపోతాయి. అయితే కేవలం ఆరు నెలల వరకు డేటా మాత్రమే లభిస్తుంది. ఇక ఇందుకోసం కచ్చితంగా మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డుకు లింకు అయి ఉండాలి.