రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరింగ్ పాలసీ కమిటీ సమావేశానికి ముందు చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించాయి. వీటిలో HDFC, IDBI, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఉన్నాయి. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం 4 అక్టోబర్ 2023 నుండి 6 వరకు జరుగుతుంది. ఈ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును యథాతథంగా ఉంచవచ్చు.