Subhash Goud | Edited By: Ravi Kiran
Dec 07, 2021 | 7:27 AM
Income Tax Return: ఆదాయపు పన్ను చెల్లింపుదారులందరూ 2021-22 అసెస్‌మెంట్ సంవత్సరానికి వీలైనంత త్వరగా రిటర్న్‌లు దాఖలు చేయాలని ఐటీ శాఖ సూచించింది.
ఐటీ రిటర్న్‌ల దాఖలుకు పొడిగించిన గడువు ఈ నెల 31 వరకు ఉంటుంది. ఇ-మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లు, మీడియా ప్రచార కార్యక్రమాల ద్వారా రిటర్న్‌ల దాఖలుపై రిమైండర్లు పంపుతున్నట్టు వెల్లడించింది.
ఇప్పటివరకు దాఖలైన రిటర్న్‌ల సంఖ్య మూడు కోట్లు దాటిందని, ఇప్పుడు రోజుకి నాలుగు లక్షలకు పైబడి రిటర్న్‌లు దాఖలవుతున్నాయని ఆ శాఖ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
వార్షిక సమాచార ప్రకటనలో అందించిన సమాచారాన్ని తమ బ్యాంకు పాస్‌పుస్తకం, వడ్డీ సర్టిఫికెట్, ఫారం-16, బ్రోకరేజి సంస్థలు అందించే మూలధన లాభాల నివేదికలోని సమాచారంతో సరిపోల్చుకోవాలని కూడా సూచించింది.