ఒడిస్సే రేసర్ లైట్ వీ2 /వీV2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.71,250 నుంచి రూ.94,450 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. రేసర్ లైట్ వీ2 విషయానికి వస్తే శక్తివంతమైన, వాటార్ రెసిస్టెంట్ మోటారుతో వస్తుంది. అలాగే లిథియం-అయాన్ బ్యాటరీ మూడు-నాలుగు గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ 75 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్‌లో ఎల్ఈడీ లైట్లు, పెద్ద బూట్ స్పేస్ ఆకట్టుకుంటాయి. ఒడిస్సే రేసర్ లైట్ వీ2 ప్లస్ స్కూటర్ సౌకర్యవంతమైన, రేడియంట్ రెడ్, పాస్టెల్ పీచ్, సఫయర్ బ్లూ, మింట్ గ్రీన్, పెర్ల్ వైట్, మ్యాట్ బ్లాక్ & కాంబాట్ గ్రీన్ వంటి ఆకర్షణీయమైన అందుబాటులో ఉంటుంది. మిగిలిన ఫీచర్లు రేసర్ లైట్ వీ2 మాదిరిగానే ఉంటాయి.
ఓలా ఎస్1 ఎయిర్ ఈవీ స్కూటర్ ధర రూ. 1.07 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 151 కి.మీ.ల మైలేజ్ ఇస్తుంది. అలాగే ఈ స్కూటర్ 5.5 సెకన్లలో 0 నుంచి 60 కి.మీ.ల వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 90 కి.మీ.ల వేగంతో దూసుకుపోతుంది. ఫీచర్ల పరంగా ఈ స్కూటర్ ఏడు అంగుళాల కలర్ టీఎఫ్‌టీ స్క్రీన్, మూవ్ ఓఎస్ 4.0, డిజిటల్ స్పీడోమీటర్‌తో పాటు నావిగేషన్, బ్లూటూత్, వైఫైలతో వస్తుంది.
హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ ఈవీ స్కూటర్ ధర రూ.1.06 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్కూటర్ 550 వాట్స్ బీఎల్‌డీసీ మోటారుతో శక్తిని పొందుతుంది. అలాగే ఈ స్కూటర్ 1.2 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 52.2వీ, 30 ఏహెచ్ లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4-5 గంటలు పడుతుంది. ఈ స్కూటర్ సింగిల్, డబుల్ బ్యాటరీ వేరియంట్లలో అందిస్తుంది. డబుల్ బ్యాటరీ వెర్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కి.మీ.లు ప్రయాణించగలదు, గంటకు 45 కి.మీ.ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు.
నియో ఎస్ఎక్స్ ఎట్రాన్స్ ఈవీ స్కూటర్ రూ. 73,999 (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంటుంది. ఈ ఈవీని 47 కి.మీ/గం గరిష్ట వేగంతో పాటు 1.8 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీతో సమర్థవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా పరిగణిస్తారు. ఈ స్కూటర్ 85-101 కి.మీ పరిధిని అందిస్తుంది.
ఒడిస్సే స్నాప్ స్కూటర్ ధర రూ. 79,999 (ఎక్స్-షోరూమ్). సొగసైన డిజైన్, వాటర్ ప్రూఫ్ బ్యాటరీ, వల్ల పట్టణ ప్రయాణానికి అనువుగా ఉంటుంది. ఈ స్కూటర్‌ను ఓ సారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అలాగే ఈ స్కూటర్‌ను నాలుగు గంటల్లో పూర్తిగా రీఛార్జ్ చేయవచ్చు. ఏదైనా ప్రామాణిక 3-పిన్ ప్లగ్‌తో అనుకూలత కారణంగా ఛార్జింగ్ సులభం.