
చెల్లించని బిల్లు.. క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్లు చెల్లించని బిల్లులు లేదా బకాయిలు ఉండకూడదు. వాటిని సకాలంలో చెల్లించాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ EMIలు గడువు తేదీకి ముందు ఎప్పుడైనా చెల్లించవచ్చు. కొంతమంది ఒక్క రోజే కదా లేట్ అయింది.. ఏం కాదులే అని అనుకుంటారు. కానీ, లేట్ ఫీజు పడుతుంది. క్రెడిట్ స్కోర్ కూడా తగ్గుతుంది.

పూర్తి చెల్లింపు.. క్రెడిట్ కార్డ్ బకాయిలను క్లియర్ చేసేటప్పుడు, కనీస బకాయికి బదులుగా మొత్తం బిల్లును చెల్లించాలని నిర్ధారించుకోవాలి . కనీస బకాయి చెల్లించడం సరైందే అయినప్పటికీ, క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవాలంటే మాత్రం పూర్తి బిల్లు కట్టేయడం మంచిది.

పెండింగ్ బిల్లులు క్లియర్.. బిల్లులు భారీగా పెరిగినప్పుడు డిస్కౌంట్‌తో బకాయిలను పరిష్కరించడం కొంతమంది క్రెడిట్ కార్డ్ వినియోగదారులలో ఒక సాధారణ పద్ధతి. అధిక క్రెడిట్ స్కోరు కలిగి ఉండాలంటే అలా చేయకండి. మీ క్రెడిట్ కార్డ్ బిల్లు రూ.1 లక్షకు చేరుకున్నప్పుడు, దానిని రూ.70,000 కు పరిష్కరించడం మంచిగా అనిపించినా.. ఇది మీ స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

కార్డులో పూర్తి లిమిట్‌ను ఉపయోగించడం.. క్రెడిట్ కార్డ్ వినియోగదారులలో మరొక అపోహ ఏమిటంటే, అవసరం వచ్చినప్పుడు మీరు మీ కార్డును పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం తప్పు కాకపోయినా.. ఇది మీ క్రెడిట్ స్కోరు తగ్గడానికి దారితీస్తుంది.

మీరు ఉపయోగించని పాత క్రెడిట్ కార్డు మీ దగ్గర ఉండవచ్చు, దానిని రద్దు చేయాలని అనుకుంటే మీ క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. అధిక క్రెడిట్ పరిమితి మీరు అధిక స్కోరును నిర్వహించడానికి సహాయపడుతుంది.