
వేసవికాలంలో చల్లదనం ఇచ్చే వస్తువులు అంటే ఇష్టపడని వారు ఉండరు. ఈ క్రమంలో తాజాగా ఏసీ లాంటి కూలింగ్ బెడ్ షీట్స్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ బెడ్‌షీట్ మీ ఇంట్లో చాలు. ఎంత అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

కూలింగ్ బెడ్ షీట్ తో వేసవి తాపానికి ఎంచక్కా చెక్ పెట్టొచ్చు. ఈ బెడ్ షీట్ పై పడుకుంటే చల్లదనం ఆస్వాదిస్తూ సుఖంగా నిద్రపోవచ్చు. ఇది చూడడానికి సాధారణ బెడ్ షీట్ మాదిరే కనిపిస్తుంది. దీని ప్రత్యేకతలు మాత్రం అద్భుతమనే చెప్పాలి.

ఈ బెడ్ షీట్ లో కూలింగ్ జెల్ మ్యాట్రెస్ ఉంటుంది. అంటే చల్లదనం కోసం జల్ సాంకేతికతను ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ బెడ్ షీట్ లో గాలి నింపబడి ఉంటుంది. ఏర్పాటుచేసిన ఫ్యాన్ 4.5 వాట్ల శక్తిని ఉపయోగిస్తుంది. అంటే ఒక యూనిట్ విద్యుత్ తో ఒక వారం పాటు ఈ బెడ్ షీట్ రన్నింగ్ లో ఉంటుంది.

ఈ బెడ్ షీట్ బరువు కేవలం రెండు కేజీలు మాత్రమే ఉంటుంది. దీన్ని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సులువుగా తీసుకు వెళ్ళవచ్చు. ఈ బెడ్ షీట్ కూలింగ్ టైమర్ తో లభిస్తుంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో బడ్జెట్ ధరలోనే ఈ బెడ్ షీట్లు లభించనున్నాయి.

ఈ మ్యాట్రెస్‌లో జెల్ టెక్నాలజీని అందించారు. దీనిని ఆన్ చేయడానికి ప్లగ్‌కి కనెక్ట్ చేయాలి. అనంతరం ఆటోమాటిక్‌గా బెడ్‌పై ఉన్న షీట్‌ను జెల్ సహాయంతో కూల్‌గా మార్చేస్తుంది. దీంతో ఇది నిమిషాల్లోనే బెడ్ షీట్‌ను చల్లబరుస్తుంది. ఈ షీట్ ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా నిశ్శబ్దంగా పనిచేస్తుంది.