
టాటా పంచ్ లోని బేస్ మోడల్ పెట్రోలు కారు ధర రూ.6.12 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో రెండు సీఎన్జీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. సీఎన్జీ బేస్ ప్యూర్ వేరియంట్ రూ.7.22 లక్షలు, అడ్వెంచర్ సీఎన్జీ వేరియంట్ రూ.7.94 లక్షలు పలుకుతుంది. టాటా పంచ్ సీఎన్జీ కారు 6000 ఆర్పీఎం వద్ద 72.4 బీహెచ్పీ, 3250 ఆర్పీఎం వద్ద 103 ఎన్ఎం టార్కును విడుదల చేస్తుంది. 3.5 అంగుళాల ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, నాలుగు స్పీకర్ల ఆడియో సెటప్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 1.2 ఎంటీ డ్యూయల్ సీఎన్జీ మాగ్నా వేరియంట్ రూ.7.75 లక్షలకు అందుబాటులో ఉంది. ఇది 6000 ఆర్పీఎం వద్ద 68 బీహెచ్పీ, 4000 ఆర్పీఎం వద్ద 95.1 ఎన్ఎం టార్కును విడుదల చేస్తుంది. 3.5 అంగుళాల ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ టైప్ సీ ఫాస్ట్ చార్జర్, అడ్జెస్టబుల్ డ్రైవర్ సీటు తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. మాన్యువల్ తో కూడిన బేస్ పెట్రోలు వేరియంట్ రూ.5.92 లక్షలకు అందుబాటులో ఉంది.

మారుతీ సుజకీ సెలెరియో వీఎక్స్ఐ సీఎన్జీ వేరియంట్ రూ.6.73 లక్షలకు (ఎక్స్ షోరూమ్) అందుబాటులో ఉంది. దీనిలో 1.0 లీటర్ కే సిరీస్ సీఎన్ జీ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దీని నుంచి 5300 ఆర్పీఎం వద్ద 55.9 బీహెచ్పీ, 3400 ఆర్పీఎం వద్ద 82.1 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ తదితర ప్రత్యేతకలు ఉన్నాయి. దీనిలోని పెట్రోలు వేరియంట్ రూ.5.36 లక్షలు పలుకుతోంది.

టాటా ఆల్ట్రోజ్ బేస్ పెట్రోలు కారు వేరియంట్ రూ.6.49 లక్షలు, బేస్ సీఎన్ జీ వేరియంట్ రూ.7.44 లక్షలకు అందుబాటులో ఉంది. సీఎన్ జీ కారును ఎనిమిది రకాల వేరియంట్లలో తీసుకువచ్చారు. ఆల్ట్రోజ్ ఎక్స్ ఈ సీఎన్జీ పేరుతో పేరుతో పిలిచే ఈ కారులో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, నాలుగు అంగుళాల ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ పార్కింగ్ సెన్సార్ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీనిలోని 1.2 లీటర్ ఐసీఎన్జీ పవర్ ట్రెయిన్ 6000 ఆర్పీఎం వద్ద 72.4 బీహెచ్పీ, 3500 ఆర్ఫీఎం వద్ద 103 ఎన్ఎం టార్కును ఉత్పత్తి చేస్తుంది.

హ్యూందాయ్ ఆరా పెట్రోలు వేరియంట్ రూ.6.48 లక్షలకు అందుబాటులో ఉంది. అలాగే మూడు రకాల సీఎన్జీ వేరియంట్లలో లభిస్తోంది. బేస్ మోడలైన ఆరా 1.2 ఎంటీ సీఎన్జీఈ ధర రూ.7.48 లక్షలుగా నిర్ణయించారు. ఇది 6000 ఆర్పీఎం వద్ద 68 బీహెచ్పీ, 4000 ఆర్పీఎం వద్ద 95.1 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 3.5 అంగుళాల ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, టిల్ట్ స్టీరింగ్ వీల్, ముందు భాగంలో పవర్ విండోస్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఎత్తును సర్దుబాటు చేసుకోగల డ్రైవర్ సీటు, వెనుక సీటు హెడ్ రెస్టులతో అందుబాటులో ఉంది.