Diesel: డీజిల్‌ సరఫరాపై కేంద్రం బిగ్ డెసిషన్.. సుంకాలు భారీగా తగ్గింపు.. మే 1 నుంచే అమల్లోకి..

Updated on: May 01, 2026 | 3:24 PM

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, ఏటీఎఫ్‌ ఎగుమతులపై అదనపు సుంకాన్ని తగ్గించింది. మే 1వ తేదీ నుంచి తగ్గింపు అమల్లోకి తెచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ద క్రమంలో దేశంలో సరఫరాను పెంచేందుకు ఎగుమతులపై కేంద్రం సుంకం పెంచింది. ఇప్పుడు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

1 / 5
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే వార్తల క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ప్యూయెల్‌(ATF) ఎగుమతులపై విండ్ ఫాల్ పన్నును తగ్గించింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యి విదేశాలకు ఎగుమతి అయ్యే డీజిల్, ఏటీఎఫ్‌పై అదనపు పన్నును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. డీజిల్ ఎగుమతులపై అదనపు పన్నును లీటర్‌కు రూ.23కి తగ్గించగా.. ఏటీఎఫ్‌పై లీటర్‌కు రూ.33కి తగ్గించారు.

2 / 5
ఇక పెట్రోల్ ఎగుమతులపై అదనపు పన్ను జీరో ఉంది. ఈ మేరకు ఆర్ధిక మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యద్దం వల్ల దేశంలో ఇంధన కొరత ఏర్పడనుందనే వార్తల క్రమంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ డెసిషన్ వల్ల ఇంధన ఎగుమతిదారులకు ఊరట కలిగింది. ఇప్పటివరకు డీజిల్‌పై లీటర్‌కు రూ.55గా ఎగుమతి అదనపు సుంకం ఉండగా.. ఇప్పుడు రూ.23కి తగ్గించారు.

3 / 5
దాదాపు 58 శాతం డీజిల్‌పై ఎగుమతి సుంకం తగ్గించారు. ఇక ఏటీఎఫ్‌పై ఇప్పటివరకు ఎగుమతి అదనపు సుంకం లీటర్‌కు రూ.42గా ఉండగా.. ఇప్పుడు రూ.33కి తగ్గించారు. మార్చి 26న డీజిల్‌పై లీటర్‌కు రూ.21.50, ఏటీఎఫ్‌పై లీటర్‌కు రూ.29.5 చొప్పున విధించింది. ఆ తర్వాత ఏప్రిల్ 11వ తేదీన జరిపిన సమీక్షలో రూ.55.5, రూ.42కి పెంచారు. ఇప్పుడు మరోసారి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎగుమతిదారులకు పన్ను తగ్గనుంది.

4 / 5
యుద్ద పరిస్థితుల క్రమంలో స్ధిరమైన ఇంధన సరఫరాను నిర్ధారించేందుకు ప్రభుత్వం ఈ పన్ను విధించింది. ధరల మధ్య వ్యత్యాసాన్ని ఎగుమతి కంపెనీలు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు పెరగడంతో  దేశీయంగా పెట్రోల్, డీజిల్ సరఫరాను పెంచేందుకు కేంద్రం ఎగుమతి సుంకాలు పెంచింది. ఇప్పుడు యుద్దం సద్దుమణగడంతో సుంకాలను తగ్గించినట్లు తెలుస్తోంది.

5 / 5
ఇక మే 1 నుంచి రాబోయే 15 రోజుల పాటు డీజిల్ ఎగుమతులపై రోడ్డు, అభివృద్ది పన్ను సున్నాగా నిర్ణయించారు.  అలాగే పెట్రోల్, డీజిల్‌పై ప్రస్తుతం విధిస్తున్న ఎక్సైజ్ సుంకంలో ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం తెలిపింది. డీజిల్‌పై ఎక్సైజ్ పన్ను సున్నాగా కొనసాగిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.

Follow Us