దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి కొత్త సంవత్సరం అంటే జనవరి 2025 నుండి తన కార్ల ధరలను 4% వరకు పెంచబోతోంది.
పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చుల కారణంగా ఈ ధరలు పెంచనున్నట్లు మారుతి సుజుకీ కంపెనీ తెలిపింది. డిసెంబర్ 6న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ ఈ సమాచారాన్ని ఇచ్చింది.
కంపెనీ ప్రకటనలో, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా జనవరి 2025 నుండి కార్ల ధరలను పెంచాలని నిర్ణయించాం. ఈ ధరల పెరుగుదల వివిధ మోడళ్లను బట్టి మారుతూ ఉంటుంది, గరిష్టంగా 4% వరకు ఉండవచ్చు అని పేర్కొంది.
కస్టమర్లపై తక్కువ ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నట్లు మారుతి సుజుకి తెలిపింది. అయితే, కొన్ని పెరిగిన ఖర్చులను మార్కెట్‌కు బదిలీ చేయడం అవసరం కావచ్చని కంపెనీ స్పష్టం చేసింది.
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీదారు స్టాక్ డిసెంబర్ 6న మధ్యాహ్నం 12:06 గంటలకు 0.58% పెరిగి రూ.11,246.9 వద్ద ట్రేడవుతోంది.