Best cars: మొదటిసారి కారు కొనుగోలు చేసేవారికి బడ్జెట్ కార్లే ది బెస్ట్.. ఆకట్టుకునే టాప్ ఫీచర్లు ఇవే..!

|

Aug 30, 2024 | 4:15 PM

మొదటిసారి కారును కొనుగోలు చేసేటప్పుడు కొంచెం కంగారుగా, గందరగోళంగా ఉంటుంది. ఏ బ్రాండ్ ఎంపిక చేసుకోవాలి, ఏ విషయాలను పరిశీలించాలి, ఎంత ధరలో తీసుకోవాలనే విషయాలపై పెద్ద చర్చ జరుగుతుంది. కారు అనేది నేడు ప్రతి కుటుంబానికి చాలా అవసరంగా మారింది. సుఖంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి వీలుంటుంది. కుటుంబంలోని సభ్యులందరూ హాయిగా ప్రయాణం చేయవచ్చు. కొత్తగా కారును కొనుగోలు చేసేటప్పుడు వాల్యూ ఆఫ్ మనీ (వీఎఫ్ఎం)లో భాగంగా కారు ధర, దాని నాణ్యత, ఆ కంపెనీ అందించే సర్వీస్, కారు రీసేల్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. దానిని అనుసరించి మార్కెట్ లో లభించే ఐదు బెస్ట్ కార్ల గురించి తెలుసుకుందాం.

1 / 5
మారుతి సుజుకి ఎ-ప్రెస్సో కారు దేశంలో ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఎస్‌యూవీ లాంటి హై రైడింగ్ స్టాన్స్‌తో కూడిన చిన్న హ్యాచ్‌బ్యాక్. దీనిని పట్టణ ప్రాంతాల్లోని ట్రాఫిక్ లో చాలా సులభంగా డ్రైవింగ్ చేయవచ్చు. ఈ కారు రూ. 4,26,500 నుంచి రూ. 6,15,000 (ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులో ఉంది. 1.0 లీటర్ కె10సీ పెట్రోల్ ఇంజిన్, పెట్రోల్ మరియు సీఎన్జీ ఇంధన ఎంపికతో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

2 / 5
మొదటిసారి కారును కొలుగోలు చేస్తున్నవారికి మారుతీ సుజుకి ఆల్టో కె10 కారు మంచి ఎంపిక. 1.0 లీటర్ ఇంజిన్ తో వచ్చిన ఈ కారు రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షలు (ఎక్స్ షోరూమ్)కు అందుబాటులో ఉంది. దీనిలో హైటెక్ ఫీచర్లు లేకపోయినప్పటికీ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌, ఏఎంటీ గేర్‌బాక్స్, పెట్రోలు - సీఎన్ జీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

3 / 5
టాటా టియాగో కారును దేశంలో ఎక్కువ మంది ఇష్టపడతారు. అత్యంత సురక్షితమైన కార్లలో ఇది ఒకటి. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో అందుబాటులో ఉంది. నగరాలు, పట్టణాలలో సురక్షితంగా ప్రయాణిాంచడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా హైవేలపై కూడా సర్రున దూసుకుపోవచ్చు. పెట్రోల్, సీఎన్ పీ ఆప్షన్లలో పాటు ఏఎంటీ గేర్‌బాక్స్, సీఎన్ టీ- ఏఎంటీ టెక్నాలజీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.

4 / 5
దేశంలోని ఆల్ టైమ్ బెస్ట్ సెల్లింగ్ కార్లలో మారుతి సుజుకి స్విఫ్ట్ ఒకటి. కారు కొనుగోలు చేయాలనుకునే వారందరూ మొదటి ప్రాధాన్యం దీనికే ఇస్తారు. దీనిలో 1.2 లీటర్ మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, మాన్యువల్, ఏటీఎం  గేర్‌బాక్స్ తో పాటు అనేక ఫీచర్లు ఉన్నాయి.

5 / 5
హ్యుందాయ్ గాండ్ ఐ10 నియోస్ కొత్త తరం కొనుగోలుదారులు, మొదటిసారిగా కారు కొనుగోలు చేసేవారికి చాలా మంచి ఆప్షన్. దీనిలో అనేక రకాల ఫీచర్లు ఉన్నాయి. పెట్రోలుతో పాటు పెట్రోలు- సీఎన్ జీ ఇంజిన్ తో ఈ కారు అందుబాటులో ఉంది.  ఐదు స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. మీరు పెట్టిన పెట్టుబడికి వందశాతం న్యాయం జరుగుతుంది. వాల్యూ ఆఫ్ మనీలో భాగంగా ఈ కారు మంచి ఎంపిక.