Budget 2025: ఈ బడ్జెట్‌లో కేంద్రం రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పనుందా? రూ.5 లక్షలకు పెరగనుందా?

Updated on: Jan 22, 2025 | 9:17 PM

Budget 2025: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునే పథకాలు కూడా ఉన్నాయి. వ్యవసాయంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా భరోసా ఇచ్చే స్కీమ్‌ అందుబాటులో ఉంది. ఈ పథకం ప్రస్తుతం రూ.3 లక్షలు ఉండగా, దానిని వచ్చే బడ్జెట్‌లో రూ.5 లక్షలకు పెంచే అవకాశం ఉంది..

1 / 5
రానున్న బడ్జెట్‌లో కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచవచ్చు. దీనికి ముందు KCC పరిమితిలో చివరి మార్పు 2006-07 సంవత్సరంలో జరిగింది. అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం మరోసారి కిసాన్‌ క్రెడిట్‌ క ఆర్డు పరిమితిని పెంచవచ్చని భావిస్తున్నారు.

2 / 5
కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. అలాగే కేసీసీ పరిమితిని పెంచితే రైతులకు వ్యవసాయం చేయడం సులభతరం అవుతుందని, విత్తనాలు, ఎరువులు, ఇతర అవసరాల కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

3 / 5
కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం సుమారు 26 సంవత్సరాల క్రితం 1998 సంవత్సరంలో ప్రారంభించింది కేంద్రం. ఈ పథకం కింద, వ్యవసాయం, సంబంధిత పనులు చేసే రైతులకు 9 శాతం వడ్డీకి స్వల్పకాలిక రుణాలు అందిస్తారు.

4 / 5
ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ప్రభుత్వం రుణంపై వసూలు చేసే వడ్డీపై 2 శాతం రాయితీని కూడా ఇస్తుంది. అదే సమయంలో మొత్తం రుణాన్ని సకాలంలో చెల్లించే రైతులకు ప్రోత్సాహకంగా మరో 3 శాతం రాయితీ ఇస్తారు.

5 / 5
అంటే ఈ రుణాన్ని రైతులకు కేవలం 4 శాతం వార్షిక వడ్డీకే ఇస్తారు. జూన్ 30, 2023 నాటికి అటువంటి రుణాలు తీసుకున్న వారి సంఖ్య 7.4 కోట్లకు పైగా ఉంది. 8.9 లక్షల కోట్లకు పైగా బకాయిలు కనిపించాయి.