
Tata Motors: మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే పలు కార్ల కంపెనీలు రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. కరోనా కాలంలో నష్టపోయిన కంపెనీలు.. ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు కస్టమర్లకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తక్కువ ధరలు, క్యాష్‌బ్యాక్, ఈఎంఐ తదితర ఆప్షన్లను వినియోగదారులకు ముందకు తీసుకువస్తున్నాయి.

ఇక తక్కువ ఈఎంఐతోనే అదిరిపోయే కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు. ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తన కార్లపై తక్కువ ఈఎంఐ ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. టాటా మోటార్స్‌కు చెందిన దేశీ సేఫెస్ట్ సెడాన్ కారు టిగోర్ కారుపై తక్కువ ఈఎంఐ ఆఫర్ ఉంది.

ఈ కారుపై ఈఎంఐ రూ.4111 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.5.59 లక్షలుగా ఉంది. ఈ కారుతోపాటు మరో కారుపై కూడా ఆఫర్ ఉంది. టాటా టియాగో కారుపై కూడా తక్కువ ఈఎంఐ ఆఫర్ లభిస్తోంది.

ఈ కారుపై ఈఎంఐ రూ.3555 నుంచి ప్రారంభం అవుతుంది. అంటే రోజుకు రూ.120 ఆదా చేస్తే నెల ఈఎంఐ కట్టవచ్చు. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ.4.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అయితే కంపెనీ ఇక ఏ వివరాలను వెల్లడించలేదు.