
Recharge Plans: టెలికం కంపెనీలు యూజర్లకు షాకిస్తున్నాయి. రీచార్జ్ ప్లాన్స్ ధరలను పెంచేశాయి. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా రెండింటిలో రూ.399 ఉన్న ప్లాన్ రూ.80 పెరిగింది. ఈప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. అపరిమిత కాలింగ్. రోజు 1.5 జీబీ డేటా, రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు.

రూ.449 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు ఎయిర్‌టెల్‌లో రూ.549కి చేరింది. వోడాఫోన్ రూ.539. ఇవి 56 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, రోజు 2 జీడీ డేటా రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు. ఎయిర్‌టెల్‌లో రూ.379 ప్లాన్ ఇప్పుడు రూ.455కు చేరింది.

డాఫోన్‌లో రూ.459. 84 రోజుల వ్యాలిడిటీ, మొత్తం 6జీబీ డేటా, వెయ్యి ఎస్‌ఎంఎస్‌లు. అపరిమిత కాలింగ్. ఎయిర్ టెల్ రూ.598, వొడాఫోన్ రూ.599 ప్లాన్స్ ఇప్పుడు రూ. 719కి చేరింది. ఇందులో 84 రోజుల వ్యాలిడిటీ, రోజు 2జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు. ఎయిర్‌టెల్ రూ.698, వొడాఫోన్ 699 ప్లాన్స్ ధరలు ఇప్పుడు రూ.839కి చేరాయి. 84 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్, రోజు2జీబీ డేటా, రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు.

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా రూ.1498 ఉన్న ప్లాన్ రూ.1799కి చేరింది. ఎయిర్‌టెల్ రూ.2498, వీ రూ.2399 ఉన్న ప్లాన్స్ రూ.2999, రూ.2899కి చేరింది. ఎయిర్‌టెల్, వీ రూ.48 డేటా ప్లాన్.. ఇప్పుడు రూ.58కి చేరింది. అలాగే రూ.98 ప్లాన్ ఇప్పుడు రూ.118కి చేరింది. రూ.251 డేటాప్లాన్ ఎయిర్‌టెల్ రూ.301, వొడాఫోన్‌ఐడియాలో రూ.298కి చేరింది.