చిన్న పరిమాణం కలిగిన స్థలాలలో వినియోగించుకోవడానికి బజాజ్ డీఎంహెచ్ 65 నియో 65 లీటర్ల ఎయిర్ కూలర్ బాగుంటుంది. దీనిలో యాంటీ మైక్రోబయల్ కూలింగ్ ప్యాడ్లు చక్కని చల్లదనాన్ని అందిస్తాయి. తాజా, సూక్ష్మ క్రిములు లేని స్వచ్ఛమైన గాలిని ప్రసరిస్తాయి. గది చల్లగా ఉండడంతో పాటు అలర్జీ కారకాలను అరికడతాయి. మూడు రకాల స్పీడ్ మోడ్ లతో గాలి వేగాన్ని నియంత్రించుకోవచ్చు. అదనపు చల్లదనం కోసం ఐస్ చాంబర్ వినియోగించుకోవచ్చు. 60 లీటర్ల ట్యాంకు కెపాసిటీ కలిగిన ఈ కూలర్ ను అమెజాన్ లో రూ.10,299కు కొనుగోలు చేయవచ్చు.
బజాజ్ డీఎంహెచ్ 90 నియో డెసర్ట్ కూలర్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. తక్కువ నీటిని ఉపయోగించుకుని ఎక్కువ చల్లదనాన్నిఅందిస్తుంది. దీనిలోని టర్బో ఫ్యాన్ టెక్నాలజీతో గదిలోని అన్ని మూలలకు చల్లని గాలి ప్రసరిస్తుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ ప్యాడ్ లు బ్యాక్టీరియాను అడ్డుకుని స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. నీటిస్థాయిని పర్యవేక్షించడానికి ఆటో నీటి స్థాయి సూచిక ఉపయోగపడుతుంది. దీనిలోని డ్యూరామెరైన్ పంప్ కు రెండేళ్ల వారంటీ కూడా ఉంది. సుమారు 85 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ కలిగిన బజాజ్ ఎయిర్ కూలర్ ను రూ.10,999కు అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు.
క్రాంప్టన్ ఆప్టిమస్ 100 లీటర్ల డెజర్ట్ ఎయిర్ కూలర్ తో ప్రతి రోజూ నీటిని నింపే పనికి స్వస్తి పలకవచ్చు. అస్తమాను రీఫిల్లింగ్ చేసే అవసరం లేకుండానే చల్లని గాలిని ఆస్వాదించవచ్చు. దీనిలోని ఎవర్ లాస్ట్ పంప్ టెక్నాలజీతో కూలర్ పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది. వేగవంతమైన గాలి, నాలుగు మార్గాల్లో ప్రసరణ, మూడు స్పీడ్ సెట్టింగ్, చల్లని గాలిని అందించే ప్యాడ్లు అదనపు, ఆటో ఫిల్ ఫీచర్ల, ఐస్ చాంబర్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. మధ్యస్తం నుంచి పెద్ద సైజు గదులకు చాలా బాగుంటుంది. అమెజాన్ లో రూ.16,499కి ఈ ఎయిర్ కూలర్ అందుబాటులో ఉంది.
వేసవి కాలంలో మంచి చల్లదనాన్ని అందించే కూలర్లలో క్రాంప్టన్ ఓజోన్ రాయల్ ఒకటి. దీనిలోని ఎవర్ లాస్ట్ పంప్ టెక్నాలజీ తో పనితీరు బ్రహ్మాండంగా ఉంటుంది. పెద్ద గదులలో వినియోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. మరింత చల్లని గాలిని పొందాలంటే వెనుక ఉన్న ఐస్ చాంబర్ ను ఉపయోగించుకోవచ్చు. దుమ్ము, కీటకాలను దూరంగా ఉండడంతో పాటు పూర్తిగా మడత పెట్టగల లైవర్లతో మన్నిక, శుభ్రత మరింత మెరుగ్గా ఉంటుంది. వైడ్ యాంగిల్ ఎయిర్ డిఫెక్షన్ దీనికి అదనపు ప్రత్యేకత. 75 లీటర్ల వాటర్ ట్యాంక్ కెపాసిటీ కలిగిన ఈ ఎయిర్ కూలర్ ను అమెజాన్ లో రూ.9,999కు కొనుగోలు చేయవచ్చు.
తక్కువ నీటిని వినియోగించుకునే కూలర్లలో ఓరియంట్ డ్యూరాచిల్ ఎయిర్ కూలర్ ముందు వరుసలో ఉంటుంది. దీనిలోని డెన్సెస్ట్ హనీకంబ్ ప్యాడ్ లు నీటిని చాలా తక్కువ వినియోగించుకుంటాయి. దుమ్ము, కీటకాలను దూరంగా ఉంచడంతో పాటు పరిశుభ్రతను కాపాడుకోవడానికి లౌవర్లు ఉపయోగపడతాయి. అలాగే ఐస్ చాంబర్ తో అదనపు చల్లదనం పొందవచ్చు. మూడు స్పీడ్ ఎంపికలతో సరిపడిన విధంగా గాలిని సర్దుబాటు చేసుకోవచ్చు. 40 లీటర్ల ట్యాంకు కెపాసిటీ కలిగిన ఓరియంట్ కూలర్ .. అమెజాన్ లో రూ.6,099కు అందుబాటులో ఉంది.