
గతేడాది ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలు తాజాగా క్రమంగా తగ్గుతూ వచ్చాయి. గత ఆగస్టులో తులం బంగారం ధర ఏకంగా రూ. 56 వేలకుపైగా పలికిన తులం బంగారం ధర క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఒకానొక సమయంలో రూ. 46,500 కనిష్ట ధరకు పడిపోయిన విషయం తెలిసిందే.

ఇలా కనీవినీ ఎరగని రీతిలో బంగారం ధరలు పడిపోవడంతో. చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే బంగారంపై పెట్టుబడులు పెట్టే వారు మాత్రం ధరలు మరింత తగ్గుతాయేమోనని భావిస్తున్నారు. దీంతో గోల్డ్‌పై ఇన్‌వెస్ట్‌మెంట్‌కు సంశయిస్తున్నారు.

కానీ నిపుణులు మాత్రం బంగారం ధర ఇంతలా తగ్గిన ఈ సమయంలోనూ గోల్డ్‌పై పెట్టుబడులు లాభదాయకమేనని చెబుతున్నారు. నిపుణుల అంచనా ప్రకారం దీపావళి నాటికి తులం బంగారం ధర రూ. 52,500కి చేరే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం జులై నెలలో బంగారం ధర ఇంతలా తగ్గడానికి.. ఈ నెలలో వివాహాలు లేకపోవడమే కారణమని చెబుతున్నారు. ఇక అత్యంత తక్కువ సమయలోనే రూ. 46,500 ఉన్న తులం బంగారం రూ. 48,500 చేరుకోవడం గోల్డ్‌పై ఉన్న డిమాండ్‌కు నిదర్శనంగా చెప్పవచ్చంటున్నారు.

ఈ కారణంగానే దీపావళి నాటికి తులం బంగారం ధర కచ్చితంగా రూ. 52,500 వరకు చేరుకోవచ్చని నిపుణులు ధీమాగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాదంతా బంగారంపై పెట్టుబడులు పెట్టే వారికి ప్రతికూలంగా సాగిందని చెప్పాలి. కానీ ట్రెండ్ చూస్తుంటే రానున్న రోజుల్లో గోల్డ్ ధర కచ్చితంగా పెరగనుందని చెబుతున్నారు.