GST Reduction: జీఎస్టీ తగ్గింపు తర్వాత ఏసీ, వాషింగ్ మెషీన్, టీవీల ధరలు ఎంత తగ్గుతాయో తెలుసా?

Updated on: Sep 07, 2025 | 4:38 PM

GST Reduction: కేంద్ర ప్రభుత్వం ఇటీవల సామాన్యులకు గుడ్‌న్యూస్‌ చెబుతూ కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ తగ్గిస్తూ ప్రకటన వెలువడింది. ఈ దసరా, దీపావళి పండగలకు ముందు కేంద్రం పెద్ద గిఫ్ట్‌ అనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నో వస్తువులపై జీఎస్టీ తగ్గింపు తర్వాత భారీగా ధరలు తగ్గనున్నాయి. ఇప్పుడు వాషింగ్‌ మెషీన్స్‌, ఏసీలు, టీవీలపై కూడా భారీగా ఆదా చేసుకోవచ్చు. మరి ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకుందాం..

1 / 7
GST Reduction: దసరా, దీపావళి పండగలకు ముందు  కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద బహుమతిని అందిస్తోంది. రాబోయే రోజుల్లో మీరు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన ఏదైనా వస్తువులను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఎంతో డబ్బును ఆదా చేసుకోవచ్చు. కొత్త GST రేట్లు అమలు చేసిన తర్వాత పలు వస్తువుల కొనుగోలుపై భారీగా డబ్బులు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.

2 / 7
కొత్త మార్పు ప్రకారం, ఎయిర్ కండిషనర్లు ఇప్పుడు 18 శాతం GSTని ఆకర్షిస్తాయి. ఇది గతంలో 28 శాతంగా ఉంది. ఇప్పటివరకు 28 శాతం స్లాబ్‌లో ఉన్న టెలివిజన్లను ఇప్పుడు 18 శాతం GST పన్ను పరిధిలోకి తీసుకువచ్చారు. అందుకే టీవీ, AC, వాషింగ్ మెషీన్ ఎంత చౌకగా ఉంటాయో తెలుసుకుందాం.

3 / 7
బుధవారం న్యూఢిల్లీలో 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. జీఎస్టీ పన్ను స్లాబ్‌లో మార్పులు చేశారు. దీని తర్వాత స్మార్ట్ టీవీలు, ఎయిర్ కండిషనర్లు (ఏసీలు), ఎలక్ట్రానిక్ డిష్‌వాషర్లపై జీఎస్టీ పన్ను స్లాబ్ మార్చింది కేంద్రం. ఇది సెప్టెంబర్ 22, 2025 నుండి అమలులోకి వస్తుంది. ఇప్పటివరకు వాటిపై 28% పన్ను విధించగా, ఇప్పుడు వాటిపై 18% పన్ను విధించనుంది.

4 / 7
ఉదాహరణకు టీవీ అసలు ధర రూ. 10,000 అనుకుందాం. అప్పుడు పాత జీఎస్టీ 28%తో కలిపితే మొత్తం రూ. 12,800. ఇప్పుడు కొత్త ధర జీఎస్టీ18%తో కలిపితే రూ. 11,800 అవుతుంది. దీనివల్ల రూ. 1000 ఆదా అవుతుంది.

5 / 7
కొత్త GST పన్ను తర్వాత AC పై ఎంత పొదుపు ఉంటుంది? ఎయిర్ కండిషనర్లపై జీఎస్టీ 28%కి బదులుగా 18%కి తగ్గించిన తర్వాత అనేక వేల రూపాయలు ఆదా అవుతుంది. AC అసలు ధర రూ. 30,000 అనుకుందాం. పాత ధర (28% GST) = రూ. 30,000తో కలిపితే మొత్తం రూ. 38,400. అలాగే, కొత్త ధర జీఎస్టీ 18% అయితే రూ. 30,000 టీవీపై రూ. 35,400 అవుతుంది. అంటే రూ. 3,000 ఆదా అవుతుంది.

6 / 7
వాషింగ్ మెషీన్లు కూడా చౌకగా లభిస్తాయి. ఈ యంత్రాలను ఇళ్ల నుండి పెద్ద రెస్టారెంట్ల వరకు ఉపయోగిస్తారు. ఈ యంత్రాలను 18% GST కిందకు తీసుకువచ్చారు, గతంలో వాటిపై 28% వర్తించేది.

7 / 7
డిష్‌వాషర్ మెషిన్ అసలు ధర రూ. 10,000 అయితే గతంతో 28 శాతం జీఎస్టీ ఉండేది. మొత్తం ధర రూ. 12,800 అయ్యేది. కానీ ఇప్పుడు జీఎస్టీ తగ్గింపు తర్వాత అంటే 18 శాతానికి తగ్గించారు. అప్పుడు 18 శాతం జీఎస్టీతో కలిపితే మొత్తం రూ.11,800 అవుతుంది. అంటే రూ. 1000 ఆదా అవుతుంది.