
అకో మొబైల్ అప్లికేషన్ ద్వారా అంబులెన్స్ బుక్ చేసుకోవచ్చు. అకో ఈ ప్రత్యేక ఫీచర్‌ని వినియోగదారులకు అందించడానికి దేశంలోని ప్రముఖ అత్యవసర ప్రతిస్పందన సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటైన రెడ్ హెల్త్‌లో చేరింది.

ఈ యాప్ బలమైన నెట్‌వర్క్ నుంచి సమీప అంబులెన్స్‌ను పొందడంలో సహాయపడుతుంది. అలాగే డ్రైవర్ వివరాలను మూడు నిమిషాల కంటే తక్కువ సమయంలో షేర్ చేస్తుంది.

వినియోగదారులు అకో మొబైల్ యాప్‌లో రియల్ టైమ్ ట్రాకింగ్ ఎంపికను కూడా పొందుతారు. కస్టమర్‌లు మ్యాప్‌లో అంబులెన్స్‌కు సంబంధించిన కచ్చితమైన స్థానాన్ని, దాని రాక అంచనా సమయాన్ని చూడవచ్చు.

ప్రస్తుతం ఈ ఫీచర్ బెంగళూరులో అందుబాటులో ఉంది. త్వరలో ఇది ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కత్తా నగరాల్లో అందుబాటులోకి రానుంది. ఐదు నగరాల్లోని సుమారు 3,000 అంబులెన్స్‌లు ఈ చొరవ కింద కవర్ చేస్తామిన స్పష్టం చేసింది.

ఈ కొత్త ఫీచర్ వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తులకు క్లిష్టమైన సహాయాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా అత్యవసర సమయంలో అంబులెన్స్ సేవలను త్వరగా పొందేందుకు వీలుగా ఉంటుంది.