
Kawasaki Ninja: ప్రస్తుతం మార్కెట్లో కొత్త కొత్త బైక్‌లు విడుదల అవుతున్నాయి. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వాహన తయారీ సంస్థలు కొత్త కొత్త ఫీచర్స్‌ను జోడిస్తూ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి.

ఇక కవాసకి ఇండియా భారత్‌లో 2022 కవాసకి నింజ 1000ఎస్‌ఎక్స్‌ను విడుదల చేసింది. ఎమరాల్డ్ బ్లేజ్డ్ గ్రీన్, మెటాలిక్ మ్యాటీ గ్రాఫీన్ స్టీల్ గ్రే కలర్స్‌లో ఆకట్టుకునేలా ఉంది.

ఇక ధర విషయానికొస్తే రూ.11,40,000 (ఎక్స్‌షోరూం, భారత్). ఇందులో టెక్నాలజీ పరంగా మంచి ఫీచర్స్‌ను పొందుపర్చినట్లు కంపెనీ వెల్లడించింది.

రిలక్స్డ్ పొజిషన్స్‌లో స్పోర్ట్స్, టూరింగ్ రైడ్స్‌కు అనుకూలంగా ఉండేలా ఈ బైక్‌ను తయారు చేసింది కంపెనీ. ఇంకా ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. 6-స్పీడ్ గేర్‌బాక్స్, కవాసకి క్విక్ షిఫ్టర్ వంటి స్పెసిఫికేషన్స్ జోడించింది కంపెనీ.