వంకాయ, ఎండు చేప, కోడి గుడ్లకూర.. ముద్ద ముద్దకు ఊరించే పల్లెటూరి రుచి!

Updated on: Jun 17, 2026 | 7:56 PM

వంకాయ, ఎండు చేప, కోడి గుడ్లకూర.. ఒకసారి తింటే ఆ రుచిని అసలు మర్చిపోరు. ఈ కాంబినేషన్ కూర తింటే ఒక ప్లేట్ తినే చోట రెండు ప్లేట్స్ తింటారు. మూడు ముద్దలే ఎక్కువ తింటారు. మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
కావాల్సిన పదార్ధాలు : పావు కిలో వంకాయలు, 100 గ్రాములు ఎండు చేపలు, నాలుగు కోడి గుడ్లు, రెండు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయంత  చింతపండు,  రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 8 వెల్లుల్లి రెబ్బలు,  నాలుగు కరివేపాకు ఆకులు,  కొత్తిమీర  కొద్దిగా, నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి తగినంత ఉప్పును తీసుకోవాలి.

2 / 5

వంకాయ ఎండు చేప కోడి గుడ్ల పులుసు తయారి విధానం : ముందుగా ఎండు చేపలను తీసుకుని వాటిని బాగా  కడిగి 10 నిమిషాలు పాటు  గోరువెచ్చని నీటిలో బాగా నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని వంపి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు గుడ్లను ఉడికించి పొట్టు తీసి  పక్కన పెట్టాలి.  చింతపండును నీటిలో నానబెట్టి వాటి నుంచి రసం తీసి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
పాన్ లో ఆయిల్  వేసి బాగా వేడయ్యాక నాలుగు నాలుగు కరివేపాకు, 10 వెల్లుల్లి, 10 పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసి గోల్డ్ కలర్లోకి  వచ్చే వరకు బాగా వేయించాలి. నాలుగు టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి.

4 / 5
వంకాయ ఎండు చేప కోడి గుడ్ల పులుసు తయారి విధానం స్టెప్  3 :  ఇప్పుడు నాలుగు వంకాయ ముక్కలు కూడా వేసి 10 నిమిషాలు పాటు వేయించాలి. నాలుగు ఎండు చేపలు కూడా వేసి మరో 3 నిమిషాలు కలుపుతూ వేయించాలి. కొద్దిగా చింతపండు రసం,  అవసరమైనంత నీరు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి 10 నిమిషాలు పాటు మరిగించాలి.

5 / 5
చివర్లో కొత్తిమీరను వేసుకోవాలి : వంకాయలు బాగా మెత్తగా అయిన తర్వాత దీనిలో ఉడికించిన గుడ్లను పులుసులో వేయాలి.  ఇలా ఇంకో మరో 5 నిమిషాల పాటు మీడియం మంటపై వాటిని బాగా మరిగించి నూనె పైకి తేలే వరకు దీనిని అలాగే ఉంచాలి.  ఇక చివర్లో దించే ముందు కొద్దిగా కొత్తిమీర చల్లి  దించేసి వేడి వేడి అన్నంలో తింటే  మంచి రుచిగా ఉంటుంది

Follow Us