1 / 8
ఎక్కువ మంది భారతీయులు తమ రోజుని పాలతో చేసిన టీతో ప్రారంభించడం సర్వసాధారణం. అయితే పోహా, ఇడ్లీ, దోశ, పొటాటో శాండ్‌విచ్ వంటివి అల్పాహారానికి సరైనవిగా పరిగణించబడతాయి. హెల్త్‌లైన్ ప్రకారం ఉదయం తినే అల్పాహారం భారీగా ఉండాలి. అందువల్ల చాలా మంది ప్రజలు అల్పాహారంలో ఇటువంటి వాటిని తింటారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్ధాలు ఎసిడిటీతో ఇబ్బంది పడేలా చేస్తుంది. అయితే ఎక్కువ మంది ఎసిడిటీని తేలికగా తీసుకుంటారు. ఈ ఎసిడిటీ నిరంతరం కొనసాగితే కడుపులో అనేక తీవ్రమైన సమస్యలకు కారణం అవుతుంది.