Brain Boosting Foods: మీ మెదడు పాదరసంలా పదునెక్కాలంటే ఈ ఆహారాలు తినండి.. జ్ఞాపకశక్తికి వేయి ఎనుగుల బలం

Updated on: Mar 25, 2024 | 1:30 PM

ఉదయం చేసిన పనులు మధ్యాహ్నం నాటికి మరచిపోవటం, తరచుగా ఏదీ గుర్తుపెట్టుకోలేకపోవడం వంటి సమస్యలు మతిమరుపుకు చిహ్నాలు. నిజానికి మెదడు సరిగ్గా పని చేయక పోతే ఈ విధమైన జ్ఞాపక శక్తి రుగ్మతలు వస్తాయి. మన మెదడు దాదాపు 60 శాతం కొవ్వుతో రూపొందించబడి ఉంటుంది. చాలా భాగం ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఒమేగా 3 మెదడు కణజాలం, నరాల కణాలను నిర్మించడంలో సహాయపడుతుంది..

1 / 5
ఉదయం చేసిన పనులు మధ్యాహ్నం నాటికి మరచిపోవటం, తరచుగా ఏదీ గుర్తుపెట్టుకోలేకపోవడం వంటి సమస్యలు మతిమరుపుకు చిహ్నాలు. నిజానికి మెదడు సరిగ్గా పని చేయక పోతే ఈ విధమైన జ్ఞాపక శక్తి రుగ్మతలు వస్తాయి. మన మెదడు దాదాపు 60 శాతం కొవ్వుతో రూపొందించబడి ఉంటుంది. చాలా భాగం ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఒమేగా 3 మెదడు కణజాలం, నరాల కణాలను నిర్మించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మెదడు, జ్ఞాపకశక్తికి చాలా ముఖ్యం. అయితే మీ రోజువారీ ఆహారంలో ఏ ఆహారాలు తింటే మెదడు ఆరోగ్యంగా ఉంటుందో నిపుణుల మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
మీ జ్ఞాపక శక్తి పదునెక్కాలంటే.. ఇకపై రోజూ కాఫీ తాగడం అలవాటు చేసుకోవాలి. కాఫీలో కెఫీన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడును చురుకుగా ఉంచడంలో సహాయపడతాయి.

3 / 5
అలాగే వంటతో పాటు పచ్చి పసుపు తినడానికి ప్రయత్నించాలి. పసుపులో కర్కుమిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది మెదడు కణజాలం దెబ్బతినకుండా కాపాడుతుంది. అంతేకాకుండా, పసుపులో చాలా యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు ఉంటాయి. ఇవి ఎలాంటి మెదడు సమస్యలు తలెత్తకుండా పని చేస్తాయి.

4 / 5
 గుమ్మడి గింజలు తినడానికి ప్రయత్నించాలి. గుమ్మడి గింజల్లో జింక్, మెగ్నీషియం, కాపర్, ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల మెదడు బాగా పని చేయడంలో సహాయపడుతుంది.

5 / 5
గుడ్లలో ఫోలేట్, విటమిన్ B6, విటమిన్ B12, కోలిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. అలాగే గుడ్డులోని క్యాల్షియం ఎముకల ఆరోగ్యానికి, జుట్టు పెరుగుదలకు  సహాయపడుతుంది.