
గ్రహాల కలయిక అనేది చాలా కామన్. అయితే నేడు జూన్15న సూర్యుడు వృషభ రాశిని విడిచి మిథున రాశిలోకి ప్రేశించబోతున్నాడు. ఇప్పటికే ఆ రాశిలో బుధ గ్రహం, గురు గ్రహం ఉన్నారు. దీంతో మూడు గ్రహాల కలయిక జరగబోతుంది. దీని వలన బ్రహ్మాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది. ఇది 12 రాశులపై తన ప్రభావం చూపగా, మూడు రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

మిథున రాశి : మిథున రాశి వారికి బ్రహాదిత్య రాజయోగం వలన అనేక శుభ ఫలితాలు కలగనున్నాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అని పనుల్లో విజయం మీ సొంతం అవుతుంది. చాలా రోజుల నుంచి దూరప్రయాణాలు చేయాలి అనుకునే వారి కల నెరవేరుతుంది. విద్యార్థులకు, వ్యాపారస్తులకు కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులు పెట్టుబడుల ద్వారా అనేక లాభాలు అందుకుంటారు. తమ కలను నెరవేర్చుకుంటారు. ఆనందంగా గడుపుతారు.

సింహ రాశి : సింహ రాశి వారికి మిథున రాశిలోకి సూర్యుడి సంచారంతో అదృష్టం కలగ నుంది. వీరు ఏ పని చేపట్టినా అందులోవిజయం సాధిస్తారు. పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతుంది. చాలా కాలంగా వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. అప్పులు తీరిపోయి చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుంది. చాలా అద్భుతంగా ఉండబోతుంది.

ధనస్సు రాశి : బుధిత్య రాజయోగం వలన ధనస్సు రాశి వారు ఊహకందని లాభాలు అందుకోనున్నారు. ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతుంది. కళ రంగంలో ఉన్న వారు మంచి ప్రతిభను కనబరిచి తన పై ఉన్నవారి నుంచి ప్రశంసలు పొందుతారు. ఏ పని చేసినా అందులో విజయం వీరిదే అవుతుంది. ఇంటా బయటసానుకూల వాతావరణం ఏర్పడుతుంది. చాలా కాలంగా ఉన్న సమస్యల నుంచి బయటపడుతారు.

ధనస్సు రాశి : ఆరోగ్యం విషయంలో చింత అవసరం లేదు. అనారోగ్య సమస్యల నుంచి కోల్కొనే అవకాశం ఉంది. వ్యాపారస్తులు పెట్టుబడుల ద్వారా అనేక లాభాలు పొందుతారు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా కలిసి వస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందే ఛాన్స్ ఉంది. జీతం పెరగడంతో ఆనందంగా గడుపుతారు.