
Eggs

గుడ్డులో ఎన్నో పోషకాలు, విటమిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జుట్టుని ఒత్తుగా, అందంగా పెరిగేలా చేస్తాయి. గుడ్డులోని పచ్చసొన, తెల్లసొన రెండింటిలోనూ బయోటిన్ ఉంటుంది. అయితే, పచ్చసొనలో బయోటిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుడ్డు పచ్చసొన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

ఒక గుడ్డు నుండి ఆరు గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. కాబట్టి గుడ్లు తినడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడే జింక్ కూడా గుడ్డులో ఉంటుంది. గుడ్డు పచ్చసొన నుండి జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్ డి కూడా లభిస్తుంది.

ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడే ఐరన్ కూడా గుడ్డు నుండి సమృద్ధిగా లభిస్తుంది. గుడ్డులో ఉండే సెలీనియం కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

ఆవ నూనెలో కొంచెం బెల్లం వేసి వేడి చేయాలి. ఆ నూనె చల్లబడిన తర్వాత దానిని తలకు పట్టించాలి. అరగంట అలాగే ఉంచి షాంపూతో తలస్నానం చేయాలి. ఇది మీ జుట్టు రాలిపోవడాన్ని అరికట్టి, జుట్టు మెరిసేలా మంచి షైనింగ్ ఇస్తుంది. జుట్టు మూలాలు కూడా బలంగా మారుతాయి.