Natural Ways to Purify Blood: రక్తాన్ని సహజంగా శుద్ధి చేసే ఆహారాలు.. కాలేయం, గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు!

|

Jun 21, 2024 | 1:21 PM

శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్, పోషకాలను సరఫరా చేయడంలో రక్తం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. అలాగే, శరీరంలోని వివిధ ముఖ్యమైన విధుల్లో రక్తం పాత్రే కీలకం. అందుకే రక్తాన్ని టాక్సిన్స్ లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం..

1 / 5
శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్, పోషకాలను సరఫరా చేయడంలో రక్తం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. అలాగే, శరీరంలోని వివిధ ముఖ్యమైన విధుల్లో రక్తం పాత్రే కీలకం. అందుకే రక్తాన్ని టాక్సిన్స్ లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం.

2 / 5
ప్రధానంగా తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో హానికరమైన పదార్థాలు పేరుకుపోతాయి. రక్తంలో టాక్సిన్స్ ఉంటే శరీరంలో రకరకాల సమస్యలు తలెత్తుతాయి. చర్మ సమస్యలు కూడా పెరుగుతాయి. రక్తాన్ని శుద్ధి చేసేందుకు ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేకుంగా ఆహారం ద్వారా సహజ పద్ధతుల్లో శుభ్రం చేసేయొచ్చు. యాపిల్స్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలోని టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. అంతేకాదు ఈ పండు తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం కూడా రాదు.

3 / 5
అలాగే ప్రతిరోజూ ఒక వెల్లుల్లి రెబ్బను ఆహారంలో తీసుకుంటే రక్తం సహజంగా ప్యూరిఫై అవుతుంది. వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. అలాగే కాలేయం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

4 / 5
పసుపులోని కర్కుమిన్ సమ్మేళనం శరీరంలో శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనంగా పనిచేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే అల్లంలో కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థతోపాటు కాలేయ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది.

5 / 5
నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది రక్తంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది.