- Telugu News Photo Gallery Black Food for Weight Loss: These 5 Black Foods Help To Lose Weight, Must Eat
Black Food for Weight Loss: నల్లగా ఉన్నాయని అపశకునంగా భావించకండి.. ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగిస్తాయ్!
వేగంగా బరువు తగ్గాలనుకుంటే శారీరక శ్రమ, వ్యాయామానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. దానితో పాటు ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలి. శరీరంలో జీవక్రియ రేటును పెంచే అన్నిరకాల ఆహారాలను తినాలి. అప్పుడే బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. బరువు తగ్గడంలో చాలా ప్రభావవంతమైన ఆహారాలు కొన్ని ఉన్నాయి..
Updated on: Jun 04, 2024 | 8:35 PM

వేగంగా బరువు తగ్గాలనుకుంటే శారీరక శ్రమ, వ్యాయామానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. దానితో పాటు ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలి. శరీరంలో జీవక్రియ రేటును పెంచే అన్నిరకాల ఆహారాలను తినాలి. అప్పుడే బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. బరువు తగ్గడంలో చాలా ప్రభావవంతమైన ఆహారాలు కొన్ని ఉన్నాయి. ఆ ఆహారాలు నలుపు రంగులో మాత్రమే ఉంటాయి. ఈ కింది నల్లని ఐదు ఆహారాలు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.

బరువు తగ్గే సమయంలో బ్లాక్ బీన్స్ ముఖ్యమైనవి. దీన్ని రకరకాలుగా వండుకుని తినవచ్చు. ఇందులో ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. జీవక్రియ రేటును పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులోని ప్రోటీన్ కండరాలను నిర్మించడంలోనూ సహాయపడుతుంది.

బ్లాక్ రైస్ (నల్లని బియ్యం) కొంత మంది అమంగళంగా భావిస్తారు. నిజానికి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ బియ్యంలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.

బ్లాక్‌బెర్రీని పండు కూడా బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువ. జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆహారంలో స్నాక్స్‌కు బదులుగా ఈ పండ్లను తినవచ్చు.

బరువు తగ్గించే ఆహారాలలో చియా సీడ్ వాటర్ కూడా ముఖ్యమైనదే. ఇందులో పుష్కలంగా ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్, సీడ్స్ శరీరంలో మ్యాజిక్ చేస్తాయి. అలగే నల్ల పప్పు శరీరంలో కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో తక్కువ కేలరీలు ఉండటమేకాకుండా జీవక్రియ రేటును కూడా వేగంగా పెంచుతుంది.




