
చేదు అనేక ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంటుంది.. కాకరకాయ రసం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా చర్మం, జుట్టు సమస్యలను కూడా నయం చేయడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ చేదు రుచిగల కూరగాయను ఆయుర్వేదంలో అనేక సంవత్సరాలుగా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇది ఆరోగ్యంతో పాటు జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు.

పొడిబారిన జుట్టు సమస్యకు కూడా కాకర మంచి మందుగా పనిచేస్తుంది. ఇందుకోసం కాకరకాయ రసం మీ జుట్టును అనేక సమస్యల నుండి రక్షిస్తుంది. ఇందులో విటమిన్ బి1, బి2, బి3 మరియు సి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, ఫాస్పరస్, జింక్, మాంగనీస్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకు చాలా ముఖ్యమైనవి. జుట్టు రాలే సమస్యకు కాకర రసం ఔషధంగా పనిచేస్తుంది.అరకప్పు కాకర రసాన్ని తీసుకొని, అందులో చెంచా కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు, మాడుకు పట్టించి 5 నుంచి 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. 40నిమిషాల పాటు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు అప్త్లె చేస్తే జుట్టు రాలే సమస్య అదుపులోకి వస్తుందని అంటున్నారు.

వెంట్రుకలు నిస్తేజంగా ఉండి, మెరుపు కోల్పోయి ఉంటే, కాకరకాయను రసాన్ని ఉపయోగించవచ్చు. మీకు జుట్టు రాలుతున్నట్లు అనిపిస్తే, కాకరకాయ రసంలో పంచదార కలిపి తలకు పట్టించి, అరగంట తర్వాత కడిగేయండి. తరచూ ఇలా చేస్తూ ఉంటే.. క్రమంగా జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు..ఇది మీ జుట్టు మూలాలను బలపరుస్తుంది. కాకరకాయ ముక్కను తీసుకుని జుట్టు మూలాలపై రుద్దండి. దీని రసాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల చుండ్రు చాలా వరకు తొలగిపోతుంది.

జుట్టు పెరుగుదలకు కూడా కాకరకాయ జ్యూస్‌ను ఉపయోగించవచ్చు. కాకరకాయలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అంతేకాకుండా, కాకరకాయ రసం రక్త ప్రసరణకు సహాయపడుతుంది. తాజా చేదు సొరకాయ రసాన్ని జుట్టుకు రాసుకుంటే కొద్ది రోజుల్లోనే జుట్టు నెరసిపోవడం ఆగిపోతుంది. వారానికి ఒకసారి ఈ చిట్కాలను పాటించండి.

కాకర రసం, పెరుగు అరకప్పు చొప్పున తీసుకోవాలి. ఇందులో రెండు చెంచాల నిమ్మరసం యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొంత భాగాన్ని మాడుకు పట్టించి కాసేపు మునివేళ్లతో మృదువుగా మసాజ్ చేయాలి. మిగిలిన భాగాన్ని వెంట్రుకలకు మొత్తం పట్టించి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే క్రమంగా పొడిబారిన జుట్టుకు మంచి నిగారింపును సొంతం చేసుకుంటుంది.