వామ్మో.. కాకరకాయ అని పారిపోతున్నారా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎగిరిగంతేస్తారు…!

Updated on: May 08, 2025 | 2:26 PM

కాకరకాయ చూడగానే చాలా మంది ముఖం తిప్పేసుకుంటారు.. కానీ, కాకరకాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే చిన్న ముక్కకూడా వదిలిపెట్టకుండా తినేస్తారని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వివిధ పోషకాలతో సమృద్ధిగా ఉండే కాకరకాయ ఒక ఔషధం కంటే తక్కువేమి కాదని అంటున్నారు.. కాకరకాయ ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
కాకరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, ఆమ్లత్వం, ఇతర కడుపు సమస్యలను తగ్గిస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. హానికరమైన వ్యాధులతో పోరాడి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. కాకరకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.

2 / 5
కాకరకాయ జ్యూస్‌ చర్మాన్ని శుభ్రంగా, ప్రకాశవంతంగా చేస్తుంది. దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలు, మచ్చలు ఇతర చర్మ వ్యాధులను తగ్గిస్తాయి.
అంతేకాదు. కాకరకాయను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల జుట్టుకు పోషణనిస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది. జుట్టును బలంగా, మెరిసేలా చేస్తుంది.

కాకరకాయ జ్యూస్‌ చర్మాన్ని శుభ్రంగా, ప్రకాశవంతంగా చేస్తుంది. దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలు, మచ్చలు ఇతర చర్మ వ్యాధులను తగ్గిస్తాయి. అంతేకాదు. కాకరకాయను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల జుట్టుకు పోషణనిస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది. జుట్టును బలంగా, మెరిసేలా చేస్తుంది.

3 / 5
చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించడంలో కూడా కాకరకాయ సహాయపడుతుంది. కాకరకాయ తినడం వల్ల ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాకరకాయ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచి ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.

4 / 5
కాకరకాయ అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించే గుణం ఉంటుంది. డయాబెటీస్‌తో బాధపడేవారికి ఇన్సూలిన్‌ నిరోధకతను కలిగి ఉంటుంది. కాకరకాయ తినడం వల్ల శరీరంలోని విష వ్యర్థాలను తొలగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సరైన జీర్ణక్రియను కూడా నిర్వహిస్తుంది. కాకరకాయ రసం కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5 / 5
బరువు తగ్గడానికి కాకరకాయ మంచిది. బరువు తగ్గాలని ప్రయత్నించేవారు క్రమం తప్పకుండా ఈ కాకరకాయ కూరగా, లేదంటే జ్యూస్‌గా కూడా తీసుకొచ్చునని చెబుతున్నారు. కాకరకాయ జీవక్రియను పెంచుతుంది. ఫ్యాట్‌ బర్నింగ్‌ కెపాసిటీ కలిగి ఉండదు. కాకరకాయ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.