
Biryani

అయితే ఇంట్లో తయారుచేసిన బిర్యానీకి.. రెస్టారెంట్ బిర్యానీ రుచి రాదు. బిర్యానీ వండేటప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు ట్రై చేస్తే రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

బిర్యానీ చేసేటప్పుడు ప్యాక్ చేసిన మసాలాలు ఉపయోగించవద్దు. లవంగాలు, చిన్న ఏలకులు, షాజిరే, షామ్రిచ్, జాజికాయ, జైత్రి, పెద్ద ఏలకులు, దాల్చిన చెక్క వంటి మసాలా దినుసులను పొడి బాణలిలో వేయించాలి. బిర్యానీలో ఎల్లప్పుడూ ఇలాంట తాజా మసాలాలు ఉపయోగించాలి.

Biryani

మాంసాన్ని వండేముందు పుల్లని పెరుగు, బెరెస్టాతో మెరినేట్ చేయాలి. ఇది మాంసాన్ని మృదువుగా, మెత్తగా చేస్తుంది. పైగా ఆహారం రుచినీ పెంచుతుంది. చిన్న పాత్రల్లో బిర్యానీ వండకూడదు. కాస్త పెద్ద సైజు పాత్రల్లో వండటం మంచిది. అలాగే పాత్ర దిగువన కాస్త మందంగా ఉండేలా చూసుకోవాలి. పాత్రను నేరుగా మంటపై ఉంచకూడదు. తవా మీద పెట్టి బిర్యానీ చేయాలి.