ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఎగిరి గంతేసే న్యూస్.. హ్యాట్రిక్ వికెట్లు తీసిన స్వింగ్ కింగ్ !

పేసర్ భువనేశ్వర్ కుమార్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌పై హ్యాట్రిక్ వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో అతనికి ఇదే తొలి హ్యాట్రిక్.. ఈ విజయం RCB అభిమానుల ఉత్సాహాన్ని పెంచింది. భువీ తిరిగి టీమ్ ఇండియా జట్టులోకి త్వరలో వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది

Velpula Bharath Rao

|

Updated on: Dec 05, 2024 | 6:48 PM

టీమిండియాకు దూరమైన వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశాడు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఐపీఎల్ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయిన భువీ.. హ్యాట్రిక్ సాధించి సంచలనం సృష్టించాడు.

1 / 6
టీ20 క్రికెట్‌లో భువీకి ఇదే తొలి హ్యాట్రిక్. ఈ హ్యాట్రిక్‌తో భువనేశ్వర్ కుమార్ RCB అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు.

2 / 6
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్న భువనేశ్వర్ కుమార్ జార్ఖండ్‌పై హ్యాట్రిక్ వికెట్ తీశాడు. భువనేశ్వర్ కుమార్ 17వ ఓవర్లో ఈ ఘనత సాధించాడు. ఈ ఓవర్ తొలి మూడు బంతుల్లోనే భువనేశ్వర్‌ కుమార్‌ వరుసగా వికెట్లు పడగొట్టాడు.

3 / 6
మ్యాచ్ 17వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేసేందుకు వచ్చే సమయానికి జార్ఖండ్ జట్టు 116 పరుగులు చేసింది. ఆ ఓవర్ తొలి బంతికి 11 పరుగులు చేసిన రాబిన్ మింజ్‌ను ఔట్ చేసిన భువీ, అదే ఓవర్ రెండో బంతికి బాలకృష్ణను అవుట్ చేశాడు. ఆ తర్వాత మూడో బంతికి వివేకానంద తివారీ ఔటయ్యాడు.

4 / 6
నిజానికి భువీ హ్యాట్రిక్ వికెట్ ఆర్‌సీబీకి బలాన్ని చేకూర్చింది. ఎందుకంటే ఐపీఎల్ మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10.75 కోట్లు చెల్లించి భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్ చరిత్రలో భువనేశ్వర్‌కు ఇదే అతిపెద్ద జీతం అని చెప్పవచ్చు.

5 / 6
గతంలో హైదరాబాద్‌ 4.2 కోట్లుకు భువీని కొనుగోలు చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇప్పటివరకు భువీ 7 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీశాడు.

6 / 6
Follow us