డీజే వాడితే రెండు లక్షలు జరిమానా.. ఎందుకంటే?

Edited By:

Updated on: May 12, 2026 | 1:37 PM

భద్రాచలం ఏజెన్సీలోని గోత్తికోయ ఆదివాసీలు తమ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడేందుకు DJ వాడకాన్ని నిషేధించారు. DJ వాడితే రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తామని తీర్మానించారు. డోలు వాయిద్యాలు, కొమ్ము నృత్యాలతో భూమి పండుగలు, వివాహాలు జరపాలని నిర్ణయించారు. మూల ఆదివాసీ సంక్షేమ సంఘం (మాస్) ఈ వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.

1 / 5
Dటెక్నాలజీ మారుతున్నా.. సమాజంలోసమాజంలో అనేక మార్పులు వస్తున్నా ఏజెన్సీ లో ఆదివాసీలు మాత్రం తమ సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడుకోవటానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పటికీ వారి ఆచారాలు గౌరవిస్తూ, పాటిస్తూ ఉంటారు. భద్రాచలం ఏజెన్సీలోని అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గొత్తికోయ గ్రామాల్లో DJ వాడకాన్ని నిషేదిస్తూ  తీర్మానించారు మూల ఆదివాసీలు.

2 / 5
తరతరాలుగా వస్తున్న సంస్కృతిని కాపాడాలంటే స్వయంగా ఇంటికో డోలు తయారు చేసి కొమ్ము డ్యాన్సులు, రేలా నృత్యాలే కొనసాగించాలని, DJ  వాడితే రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తామని సమష్టిగా నిర్ణయించి గిరిజన గ్రామాల్లో చాటింపు వేశారు.

3 / 5
 గొత్తికోయ గ్రామాల్లో జరిగే పెళ్లిళ్లు, సాంప్రదాయం బద్దంగా నిర్వహించే భూమి పండుగలో డోలు వాయిద్యాలు, కొమ్ము నృత్యాలు, మహిళల చేతిలో గుజ్జిల్లు ఉపయోగించి భజంత్రీలచే నిర్వహించి ఆదివాసీల మూలాలను భావి తరాలకు అందించాలని తెలిపారు మాస్ అధ్యక్షుడు మడకం చందు.

4 / 5
ఆడ,మగ తేడా లేకుండా గొత్తికోయ గ్రామాల్లో డోలు తయారీతో పాటు వారికి సంస్కృతి, సంప్రదాయాల రక్షణకు ఎర్ర పాడు గ్రామంలో ప్రత్యేక శిక్షణ ఇస్తూ డ్యాన్సులు, నృత్యాలు నేర్పిస్తూ సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగుతోంది మూల ఆదివాసీ సంక్షేమ సంఘం.

5 / 5
ఆదివాసీలు తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు ప్రాధాన్యమిస్తూ బాహ్య ప్రపంచంలో వస్తున్న మార్పులు ఆదివాసీ సమాజాన్ని దెబ్బ తెస్తున్నాయని అందుకు అందుకు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకునేందుకు నడుం బిగించినట్లు మాస్ తెలిపింది.

Follow Us