Indian leaves: అరటి ఆకు ఒక్కటే కాదు! మన దేశంలో వడ్డనకు వాడే ఈ 10 ఆకుల గురించి మీకు తెలుసా?

Edited By:

Updated on: Jan 08, 2026 | 10:04 PM

భారతదేశం అంటే కేవలం రుచుల గని మాత్రమే కాదు, అద్భుతమైన వంట పద్ధతులకు కూడా నిలయం. ముఖ్యంగా ఆహారాన్ని వడ్డించడానికి లేదా వండటానికి వివిధ రకాల ఆకులను ఉపయోగించడం మన సంస్కృతిలో ఒక భాగం. చాలామందికి కేవలం అరటి ఆకు మాత్రమే తెలుసు, కానీ మన దేశంలో వివిధ ప్రాంతాల్లో మరో 10 రకాల ఆకులను వంటలలో వడ్డనలో వాడుతుంటారు. ఇవి ఆహారానికి అదనపు రుచిని ఇవ్వడమే కాకుండా, ఆరోగ్యానికి అవసరమైన యాంటీ బాక్టీరియల్ జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలను కూడా అందిస్తాయి. ఆ ఆకులేంటో వివరంగా తెలుసుకుందాం.

1 / 8
 అంజూరపు ఆకులు : వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మాంసం లేదా చేపలను వండేటప్పుడు వీటిని చుట్టి ఉడికిస్తే కొబ్బరి-వనిల్లా మిశ్రమ రుచి వస్తుంది.

2 / 8
 తమలపాకులు : వీటిలో ఉండే యూజినోల్ అనే సమ్మేళనం జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజితం చేసి గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

3 / 8
మామిడి ఆకులు : కేవలం పూజలకే కాకుండా, కొన్ని ప్రాంతాల్లో వీటిని ఆహార వడ్డనకు కూడా ఉపయోగిస్తారు. ఇవి భోజనానికి ఆహ్లాదకరమైన సువాసనను ఇస్తాయి.

4 / 8
 పనస ఆకులు : వీటిని చిన్న చిన్న ప్లేట్లుగా అల్లి వాడుతుంటారు. ఇవి ఆహారం తాజాగా ఉండటానికి సహాయపడతాయి.

5 / 8
పసుపు ఆకులు : వీటిని ముఖ్యంగా చేపల వంటి వంటకాలను ఆవిరి మీద ఉడికించడానికి వాడుతుంటారు. ఇవి ఆహారానికి అద్భుతమైన సువాసనను, యాంటీ సెప్టిక్ గుణాలను జోడిస్తాయి.

6 / 8
సాల్, టేకు ఆకులు : పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా వాడతారు. ఇవి గట్టిగా ఉండటం వల్ల భోజనానికి చాలా అనువుగా ఉంటాయి.

7 / 8
 తామర ఆకులు : ఇవి నీటిని వికర్షించే సహజ గుణాన్ని కలిగి ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

8 / 8
మోదుగ ఆకులు : వీటిని అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. దేవాలయాల్లో ప్రసాదాల వడ్డనకు వీటిని వాడతారు. వీటిలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.