Betel Leaf: తమలపాకును నీళ్లలో మరిగించి తాగితే ఏమవుతుందో తెలుసా..? నమ్మలేని లాభాలు..

| Edited By: Ram Naramaneni

May 19, 2024 | 9:56 PM

తమలపాకులో ఎన్నో ఆరోగ్య లక్షణాలున్నాయి. తమలపాకులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, కెరోటిన్, కాల్షియం వంటి పోషకాలు నిండుగా ఉన్నాయి. తమలపాకులు నమిలితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే, తమలపాకును తాంబూలం రూపంలో తీసుకోవడం కంటే.. దాన్ని మరిగించిన నీటిని తాగడంతో ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
ఇందుకోసం ముందుగా పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి, ఒక గ్లాసు నీళ్లు పోసి, ఒక తమలపాకును ముక్కలుగా కట్ చేసి అందులో వేయాలి. 5 నుంచి 7 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి తాగాలి.

2 / 5
మలబద్దకం సమస్య ఉన్నవారికి ఈ తమలపాకు నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పేగు కదలికలు బాగా జరిగేలా చేస్తుంది. శరీరంలో వాపులను తగ్గిస్తుంది. తమలపాకులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండటంవల్ల ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. అలాగే జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

3 / 5
ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో తమలపాకులు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. తమలపాకును రోజూ తినడం వల్ల కీళ్లనొప్పులు నయం అవుతాయి. తమలపాకును క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో జీవక్రియ రేటు పెరుగుతుంది. జీవక్రియ రేటు పెరిగినప్పుడు బరువు తగ్గడం సులభం అవుతుంది.

4 / 5
తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండుటవల్ల ఆస్తమాను కూడా అదుపులో ఉంచుతుంది. అంతేగాక తమలపాకును మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తున్నారు. ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తమలపాకు నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది.

5 / 5
అయితే తమలపాకు నీటిని ఎప్పుపడితే అప్పుడు తాగడం కూడా మంచిదికాదు. రోజులో ఒకసారి మాత్రమే తీసుకోవాలి. (ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)