
కొంత మంది వంట చేస్తున్నప్పుడు ఆహార పదార్థాల మరకలు షర్ట్ పై పడుతుంటాయి. అలాగే కొందరు భోజనం చేస్తున్న క్రమంలో మరకలు అంటించుకుంటారు. అయితే ఆ మరకలు పోతాయో లేదో అని చాలా మంది భయపడి పోతుంటారు. ఇంకొందరైతే ఏకంగా వాటిని పక్కన పెట్టేస్తుంటారు. కానీ ఈ టిప్స్ తో చాలా సులభంగా బట్టలపై ఉన్న మొండి మరకలు తొలిగించవచ్చునంట.

మీ బట్టలపై మొండి మరకలు, నూనె మరకలు ఉన్నట్లు అయితే మీరు మరక ఉన్న షర్ట్ తీసుకొని దానిపై బేబీ పౌడర్ లేదా కొంచెం ఉప్పు చల్లి కొద్ది సేపు అలాగే ఉండనివ్వాలంట. తర్వాత అవి నూనెను గ్రహిస్తాయి. తర్వాత ఆ షర్ట్ ను డిటర్జెంట్ పౌడర్‌లో వేసి, క్లీన్‌గా ఉతకాలి. దీంతో షర్ట్ పై ఉన్న నూనె మరకలు ఇలా సులభంగా పోతాయంట.

బట్టలపై ఉన్న మొండి మరకలను తొలిగించడంలో నిమ్మరసం చాలా బెస్ట్. ఎందుకంటే ఇందులో ఉండే సహజ ఆమ్లత్వం చాలా సులభంగా బట్టలపై నూనె మరకలను తొలిగిస్తుందంట. మరకపై నిమ్మరసాన్ని రాసి పది నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేస్తే ఎలాంటి మరకలైనా తర్వగా పోతాయంట.

డిష్ వాషింగ్ లిక్విడ్ ప్రధానంగా ఆయిల్ మరకలను తొలగించడానికి సూపర్‌గా ఉపయోగ పడుతుందంట. దీనిని మీరు ఏ బట్టలపై అయితే నూనె మరకలు ఉన్నాయో, వాటిపై రెండు చుక్కలు వేసి సున్నితంగా రుద్దాలంట. తర్వాత దానిని గోరు వెచ్చటి నీటిలో పెట్టి ఉతకాలి. అంతే షర్ట్ చాలా తెల్లగా మెరిసిపోతుంది.

మొండి మరకలు పొగొట్టడానికి బెకింగ్ సోడా కూడా చాలా బెస్ట్. మరక మీద బేకింగ్ సోడా చల్లి, మృదువైన బ్రష్ తో రుద్దండి. అది మరకను గ్రహించి తేలికపరుస్తుంది. అంతే కాకుండా పాలు కూడా నూనె మరకలను తొలిగిస్తాయంట. పాలలో కాసేపు మరక ఉన్న బట్టలను నానబెట్టి తర్వాత ఎప్పటిలాగే ఉతికితే అవి చాలా తెల్లగా పాలవలె మెరిసిపోతాయంట.