Natural Hair Conditioner: తల స్నానం చేసిన తర్వాత ఈ సహజ హెయిర్‌ కండిషర్‌లను జుట్టుకు పట్టిస్తే..

|

Jan 08, 2024 | 8:21 PM

జుట్టు శుభ్రంగా ఉంచుకోవడానికి వారానికి రెండు సార్లు షాంపూ చేయడం అవసరం. షాంపూ తర్వాత మర్చిపోకుండా కండీషనర్ ఉపయోగించాలి. కండిషనర్లు జుట్టును మృదువుగా చేస్తాయి. తేమను కోల్పోకుండా చేసి, జుట్టు దెబ్బతినకుండా కాపాడతాయి. చాలా మంది కమర్షియల్ కండీషనర్లను ఉపయోగిస్తారు. అయితే ఇవి చిట్లిన జుట్టు సమస్యను దూరం చేయవు. శీతాకాలపు అత్యంత సాధారణ సమస్య జుట్టు పొడిబారడం. తేమ లేకపోవడం, మితిమీరిన రసాయనాలు ఉండే షాంపూ వాడకం, తరచుగా స్టైలింగ్ చేయడం వల్ల..

1 / 5
జుట్టు శుభ్రంగా ఉంచుకోవడానికి వారానికి రెండు సార్లు షాంపూ చేయడం అవసరం. షాంపూ తర్వాత మర్చిపోకుండా కండీషనర్ ఉపయోగించాలి. కండిషనర్లు జుట్టును మృదువుగా చేస్తాయి. తేమను కోల్పోకుండా చేసి, జుట్టు దెబ్బతినకుండా కాపాడతాయి.

2 / 5
చాలా మంది కమర్షియల్ కండీషనర్లను ఉపయోగిస్తారు. అయితే ఇవి చిట్లిన జుట్టు సమస్యను దూరం చేయవు. శీతాకాలపు అత్యంత సాధారణ సమస్య జుట్టు పొడిబారడం. తేమ లేకపోవడం, మితిమీరిన రసాయనాలు ఉండే షాంపూ వాడకం, తరచుగా స్టైలింగ్ చేయడం వల్ల జుట్టు పొడిగా మారుతుంది.

3 / 5
ఇంటి వద్ద, సహజ పదార్థాలతో జుట్టును కండిషన్ చేయవచ్చు. చిరిగిన జుట్టుతో పాటు, ఇతర బహుళ జుట్టు సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. పుల్లటి పెరుగు, తేనెను సమంగా తీసుకుని, దానిని బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. 20-30 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం జుట్టును తేమగా ఉంచుతుంది.

4 / 5
గ్రీన్ టీతో కూడా జుట్టును కండిషన్ చేయవచ్చు. జుట్టు పొడవును బట్టి గ్రీన్ టీని ఉపయోగించాలి. గ్రీన్ టీని జుట్టు మీద పోసి కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత జుట్టును సాధారణ నీటితో కడగాలి.

5 / 5
అలోవెరా జెల్ అందుబాటులో ఉంటే.. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత తాజా అలోవెరా జెల్‌ను జుట్టుకు అప్లై చేసుకోవాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. అలోవెరా జెల్ కండీషనర్‌గా పనిచేస్తుంది. జుట్టు మరియు స్కాల్ప్ సంరక్షణ కోసం ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కలిపి, షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు పట్టించాలి. కాసేపు అలాగే ఉంచి సాధారణ నీటితో శుభ్రం చేస్తే సరి.