Beauty Tips: బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లే పనిలేదు.. ఈ 5 ఫేస్‌ ప్యాక్‌లతో ఇంట్లోనే మీ అందాన్ని పెంచుకోండి!

Updated on: Jan 11, 2026 | 8:50 AM

Easy Homemade Face Packs for Dry Skin This Winter :చలికాలంలో చర్మ సంరక్షణ చాలా అవసరం. ఎందుకంటే తీవ్రమైన చలికారణంగా ఈ సీజన్‌లో మీరు ఏ క్రీమ్ ఉపయోగించినా, చర్మం సులభంగా పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అందుకే మీ చర్మాన్ని సరిగ్గా చూసుకోవడం చాలా ముఖ్యం. శీతాకాంలో బ్యూటీ పార్లర్లకు వెళ్లకుండా ఇంట్లోనే కొన్ని ఫేస్ ప్యాక్‌లు ఉంపయోగించి మీ చర్మాన్ని రక్షించుకోవచ్చు. అదెలానో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
  తేనె ఫేస్ ప్యాక్: తేనె మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అలాగే చర్మ ఆరోగ్యానికి కూడా తెనే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు తేనెను ఫేస్‌ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం మీరు ఒక టీస్పూన్ తేనెలో, కొన్ని చుక్కల నిమ్మరసం, తగినంత రోజ్ వాటర్  వేసి బాగా కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసుకోండి. దీన్ని అప్లై చేసుకునే ముందు మీరు ముఖాన్ని కొద్దిగా తేమగా ఉంచుకునేందులు నీటితో శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత అప్లై చేయడం. ఆ తర్వాత నీటితో శుభ్రంగా మొహాన్ని కడుక్కోండి. ఇలా చేయడం ద్వారా మీ చర్మం సహజంగా మెరుస్తుంది.

2 / 5
కాఫీ ఫేస్ ప్యాక్: మీ చర్మ కాంతిని పెంచడానికి మీరు కాఫీ ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించవచ్చు. దీన్ని తయారు చేయడానికి, మీకు గ్రౌండ్ కాఫీ, తేనె, పాలు అవసరం. మీరు రెండు టీస్పూన్ల కాఫీ, ఒక టీస్పూన్ తేనె, తగినంత పాలు ఉపయోగించి ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ ప్యాక్ రెడీ అయ్యాక దాన్ని మీ ముఖానికి అప్లై చేసుకోండి. 20 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రంగా కడిగేయండి. ఇలా చేయడం ద్వారా మీ చర్మం మెరవడంతో పాటు వృద్యాప్యాన్ని తగ్గిస్తుంది.

3 / 5
బియ్యం పిండి ఫేస్ ప్యాక్: బియ్యం పిండి కూడా చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని కూడా ఫేస్ ప్యాక్‌ల తయారు చేసుకొని వాడొచ్చు. ఇందుకోసం మీరు ఒక గిన్నెలో ఒక చెంచా బియ్యం పిండి తీసుకొని, దానికి సమాన పరిమాణంలో తేనె కలిపి, ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది మీ చర్మానికి శోథ నిరోధక లక్షణాలను అందిస్తుంది. దీని వల్ల మీ చర్మం ఆరోగ్యాంగా ఉంటుంది

4 / 5
 శెనగ పిండి ఫేస్ ప్యాక్: శీతాకాలంలో మీ ముఖం మెరిసిపోవాలంటే శనగపిండి పేస్‌ ప్యాక్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్యాక్ తయారు చేసుకునేందుకు.. ముందుగా 2 టీస్పూన్ల శనగపిండిలో 1 టీస్పూన్ మిల్క్ క్రీమ్, చిటికెడు పసుపు, పాలు కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ ను మీ ముఖంపై అప్లై చేసి, 15 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత కడిగేయండి. దీంతో మీ చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.

5 / 5
అలోవెరా ఫేస్ ప్యాక్: అలోవేరా అనేది చర్మ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడే సహజ పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతాయి. ఈ ప్యాక్ తయారు చేసుకునేందుకు.. కలబంద జెల్ తీసుకొని.. అందులో కాస్తా గంధపు పొడిని యాడ్ చేయడం.. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి. శీతాకాలంలో మొటిమలను తొలగించడంలో, చర్మంపై ఉన్న మచ్చలను తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.( Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని వాడే ముందు వైద్యుల సలహా తీసుకోండి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు)