
అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ముందుగానే ఒంట్లో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఊహకందని నష్టాలు కలిగిస్తుంది. అందుకు రోజూ తీసుకునే ఆహారంలో ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి.

బాదం, వాల్‌నట్‌లు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అందువల్ల వాటిని కూడా ఎక్కువగా తినడంపై దృష్టి పెట్టాలి. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

శుద్ధి చేసిన నూనె, పామాయిల్, ఇతర సంతృప్త కొవ్వులు ఉన్న ఆహారాన్ని తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సోంపు-జీలకర్ర నీరు అద్బుతమైన ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మెంతులు, సోంపు, జీలకర్ర, కొత్తిమీర గింజలు వంటివి ఇతర ఆయుర్వేద మూలికలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ పదార్థాలతో కలిపి తయారు చేసిన నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి.

తయారీ విధానం : మెంతులు, పచ్చి సోంపు గింజలు, జీలకర్ర, ధనియాలు ఒక్కొక్కటి 2 టీస్పూన్లు తీసుకొని ఒక గిన్నె లేదా పాన్‌లో కాస్త వేయించుకోవాలి.. తరువాత, ఒక ముక్క దాల్చిన చెక్క వేసి, ప్రతిదీ 5-10 నిమిషాలు వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీస్పూన్ ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి ప్రతిరోజూ ఉదయం త్రాగాలి. క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే, త్వరలోనే మీరు ఆశించిన ఫలితం చూస్తారు.