Health Tips: పాలలో నెయ్యి కలిపి తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? ఈ సమస్యలన్నీ పరార్‌..!

|

Aug 21, 2024 | 6:24 PM

నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మంచిదని.. ఎముకలు బలంగా ఉండటానికి ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. అయితే.. ప్రస్తుత కాలంలో చాలా మంది బరువు పెరిగిపోతామని నెయ్యి తినకుండా ఉంటున్నారు. కానీ, నెయ్యి మితంగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రోజూ రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలలో ఒక స్పూన్‌ నెయ్యి కలుపుకుని తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల మీ శరీరంలో చాలా మార్పులు వస్తాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
నెయ్యిలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ మరియు విటమిన్ కె ఉంటాయి. ముఖ్యంగా దేశీ నెయ్యి తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నెయ్యి తీసుకోవడం వల్ల శరీరంలో మంట సమస్య తొలగిపోతుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. నెయ్యిలోని కొవ్వు పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి.

2 / 5
గోరువెచ్చని పాలలో నెయ్యి కలుపుకుని తాగితే శరీరానికి అమృతంలా పని చేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక చెంచా నెయ్యి కలిపి తాగడం వల్ల 7 రోజుల్లో శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. పాలు, నెయ్యి తాగడం వల్ల కూడా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు నయమవుతాయి.

3 / 5
స్వచ్ఛమైన నెయ్యి అయితే అది పూసలా ఉంటుంది. వేడిచేసినప్పుడు నూనెలా కనిపిస్తుంది. అలాగే నెయ్యి ఉపరితలంపై తెట్టులా ఏర్పడినా.. కరిగిన నెయ్యి లేత పసుపు, తెలుపు రంగులో ఉన్నా అది ఖచ్చితంగా నకిలీ నెయ్యి.

4 / 5
పాలు, నెయ్యి కలిపి తీసుకోవటం వల్ల చర్మం మెరిసేలా చేస్తుంది. నెయ్యిలో కొవ్వులో కరిగే విటమిన్‌ ఎ, డి, ఇ, కె ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, చర్మాన్ని మెరిసేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు గోరువెచ్చని పాలలో టేబుల్‌స్పూన్‌ నెయ్యి కలుపుకుని తాగడం వల్ల చర్మం కాంతివంగా మారి తళతళ మెరుస్తుంది.

5 / 5
కల్తీని గుర్తించేందుకు మార్కెట్ నుంచి తెచ్చే నెయ్యిలో నాలుగైదు చుక్కల అయోడిన్ వేయాలి. నెయ్యి నీలం రంగులోకి మారితే కల్తీ అని అర్థం. నెయ్యి నాణ్యతను గుర్తించేందుకు చేతికి కాస్త నెయ్యి రాసి రెండు చేతులతో బాగా రుద్దాలి. సువాసనగా ఉంటే అది స్వచ్ఛమైన నెయ్యి. కొంత సమయం తర్వాత నెయ్యి వాసన పోతే అది కల్తీ నెయ్యి.