కొబ్బరి నీళ్లు దాహం తీర్చడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదండోయ్.. కొబ్బరి నీళ్లకు వయసును తగ్గించే లక్షణం కూడా ఉంది. అవును.. చర్మ కాంతిని మెరుగుపరచడంతోపాటు అన్ని రకాల చర్మ సమస్యలక చక్కని చికిత్స నందిస్తుంది.
కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన మాయిశ్చరైజింగ్ గుణాలు అధికంగా ఉంటాయి. చర్మాన్ని హైడ్రేట్ చేసి, తేమగా ఉంచుతుంది. కొబ్బరి నీళ్లతో ముఖం కడుక్కుంటే ముఖంపై మచ్చలు తగ్గి, సహజమైన కాంతితో ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కొత్త చర్మ కణాల పెరుగుదలకు కొబ్బరి నీళ్లు సహాయపడతాయి.
కొబ్బరి నీళ్లలో సహజంగా యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేసే గుణం ఉంటుంది. ముఖంపై ముడతలు, ఫైన్ లైన్లను నియంత్రించి అసలు వయసు కంటే తక్కువగా కనిపించేలా చేస్తుంది.
ముఖంపై మొటిమలను పోగొట్టడంలో కొబ్బరి నీళ్లు కీలకంగా వ్యవహరిస్తాయి. ఈ నీళ్లలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉండటం మూలంగా చర్మ సమస్యలను ఇట్టే నివారిస్తాయని నిపుణులు అంటున్నారు.