ఋతు సమస్యలకు పరిష్కారం: అవకాడో తినడం వల్ల ఋతు చక్రంలో కనిపించే సమస్యలను నియంత్రించవచ్చు. ఈ పండులోని పోషకాలు ఋతు చక్రం సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. అదనంగా, ఋతుస్రావం సమయంలో సంభవించే కడుపు నొప్పి, ఉబ్బరం, ఇతర అసౌకర్యాలను తగ్గించడంలో అవకాడో సహాయపడుతుంది. ఇది మహిళలు మందులు లేకుండా ఈ సమస్యలకు సహజ పరిష్కారాన్ని పొందేందుకు హెల్ప్ చేస్తుంది.

చర్మ ఆరోగ్యానికి మంచిది: అవకాడోలో విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఈ లక్షణాలు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. చర్మ కాంతిని పెంచుతాయి. వృద్ధాప్య సంకేతాలను నివారిస్తాయి. ఆహారంలో అవకాడోను తీసుకోవడంతో పాటు, చర్మ సంరక్షణ కోసం దాని నూనెను ఉపయోగించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.

అయితే అవకాడోలో ఎన్ని సుగుణాలు ఉన్నప్పటికీ అందరికీ సమానంగా మేలు చేయదు. అవును.. కొందరికి ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ సగం అవకాడో (సుమారు 50-70 గ్రాములు) తింటే సరిపోతుందని అంటున్నారు. గుండె, మధుమేహ రోగులు దీన్ని రెగ్యులర్ డైట్‌లో ఉంచుకోవచ్చు. కిడ్నీ, లివర్ రోగులు మాత్రం వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీనిని తినాలి. అవకాడో నిస్సందేహంగా 'సూపర్‌ఫుడ్'. కానీ ఇది అందరికీ ఒకేలా మేలు చేయదనే విషయం మర్చిపోకూడదు.

గుండె ఆరోగ్యానికి మంచిది: అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది మహిళలకు చాలా ముఖ్యమైనది.

ఎముకల బలాన్ని పెంచుతుంది: అవకాడోలో ఎముకల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ కె, కాల్షియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా, అవకాడో వినియోగం స్త్రీలలో వయసు పెరిగే కొద్దీ ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.