
తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్లో అత్యంత ఉష్ణోగ్రతలు కనిపిస్తే 'రోహిణి కార్తె' అని పిలుస్తారు. అయితే, ఈ పేరు వినగానే చాలా మందికి ఓ సామెత గుర్తు వస్తుంది. రోహిణి కార్తె మొదలవుతుంది రోళ్లు పగిలేంత ఎండలు రావడం ఖాయం అని అంటుంటారు. నిప్పులు కొలిమిలో ఉన్నట్లే ఉంటుంది ఇంకా ఈ సమయంలో పిండి రుబ్బుకునే రోళ్లు కూడా పగిలిపోయేంత ఎండలు వస్తాయని ఎప్పటి నుంచో పెద్దలు అంటున్నారు.

అయితే, ఈ సారి ఆ మాట నిజమైంది. ఎన్నడూ లేని విధంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ప్రతి ఏడాది ఈ రోహిణి కార్తెలో సూర్యకిరణాలు నిలువుగా భూమి మీద పడతాయి. దెబ్బకు భూమిలో ఉన్న తేమ మొత్తం ఆవిరైపోతుంది. ఇంకా రాతిలో ఉండే తేమ ఇంకిపోయి, ఆ వేడికి పగుళ్లు కూడా వస్తాయి

ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి : ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ముఖ్యమైన పనులైతే తప్ప అస్సలు బయటకు వెళ్లవద్దు. ఎందుకంటే, ఆ సమయంలో వడదెబ్బ తగులుతుంది. అది తగలకుండా తలకు మెత్తటి క్లాత్ తో కవర్ చేయండి. ఇంకా మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకుంటూ బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచండి.

ఈ ఏడాది రోహిణి కార్తె ఎప్పుడంటే? మండిపోతున్న సూర్యుడు ప్రజలను అడుగు కూడా వెయ్యనివ్వడం లేదు. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు భారీ స్థాయికి చేరుకోవడంతో అందరూ చెమటలతో అల్లాడిపోతున్నారు. ఇంకా మరో 5 రోజుల్లో రోహిణి కార్తె రానుంది.

ఈ రోహిణి కార్తె సమయంలోనే ఎక్కువగా ఎండలు వస్తాయని చెబుతుంటారు. కానీ ఈసారి చాలా ముందే రోళ్లు పగిలేంత వేడి ఉండటంతో వాతావరణ నిపుణులు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఈ హీట్‌వేవ్ ఇంకా ఎక్కువయ్యే అవకాశముందని..అందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.