Beauty Tips: వీటిని నేరుగా ముఖానికి అప్లై చేస్తే.. చర్మం ఛాయ నల్లగా మారిపోతుందట!

|

Jul 02, 2024 | 9:06 PM

మగువలు సౌందర్య ప్రియులు అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందంగా కనిపించడానికి బ్యూటీ పార్లర్లకు వెళ్లడం, రకరకాల సౌందర్య ఉత్పత్తులు వినియోగించడం వంటివి ట్రై చేస్తూ ఉంటారు. అయితే కొందరు డబ్బు ఆదా చేయడానికి ఇంట్లోనే అందాన్ని పెంపొందించే సౌందర్య చిట్కాలు వినియోగిస్తుంటారు..

1 / 5
మగువలు సౌందర్య ప్రియులు అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందంగా కనిపించడానికి బ్యూటీ పార్లర్లకు వెళ్లడం, రకరకాల సౌందర్య ఉత్పత్తులు వినియోగించడం వంటివి ట్రై చేస్తూ ఉంటారు. అయితే కొందరు డబ్బు ఆదా చేయడానికి ఇంట్లోనే అందాన్ని పెంపొందించే సౌందర్య చిట్కాలు వినియోగిస్తుంటారు.

2 / 5
కానీ చాలా మంది ఇంటి వద్ద వినియోగించే చిట్కాలలో కొన్ని తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా ఈ కింది పదార్ధాలను నేరుగా ముఖంపై అప్లై చేయకూడదు. పొరబాటున వీటిని వినియోగిస్తే మరింత నష్టం చేకూరుతుందట. ముఖ్యంగా ముఖాన్ని వేడి నీటితో అస్సలు కడగకూడదు. వేడి నీళ్లతో ముఖం కడుక్కుంటే చర్మం సహజ తేమ కోల్పోతుంది. దీంతో చర్మం చాలా రఫ్ గా మారుతుంది. కావాలంటే స్టీమ్ ఫేషియల్ చేసుకోవచ్చు. కానీ నేరుగా ముఖంపై వేడి నీటిని వేసుకోకూడదు.

3 / 5
నిమ్మరసం ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుందని.. నిమ్మరసాన్ని అనేక ఫేస్ ప్యాక్‌లలో కూడా ఉపయోగిస్తుంటారు. అయితే నిమ్మరసాన్ని నేరుగా ముఖానికి రాసుకోకూడదట.

4 / 5
ముఖానికి టూత్‌పేస్ట్‌ను ఎప్పుడూ అప్లై చేయకూడదు. టూత్‌పేస్ట్‌ను అప్లై చేయడం వల్ల మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో చర్మం రంగు మారవచ్చు. గడువు ముగిసిన సన్‌స్క్రీన్‌ను వినియోగించకూడదు. గడువు ముగిసిన సన్‌స్క్రీన్ ఎండ నుండ చర్మాన్ని రక్షించకపోగా చర్మంపై అలర్జీలకు కారణం అవుతుంది.

5 / 5
ముఖం చర్మం.. చేతులు, కాళ్ళ చర్మం కంటే చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే ముఖంపై వెంట్రుకలను తొలగించడానికి మైనపు వ్యాక్స్‌ ఉపయోగించకూడదు. ఇది చర్మాన్ని చికాకుపెడుతుంది. దీంతో ముఖంపై దద్దుర్లు వస్తాయి.