
ప్రస్తుతం ఐస్ బాత్ ట్రెండ్ నడుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ సహా చాలా మంది స్టార్స్ కూడా ఫాలో అవుతున్నారు. ఐస్ బాత్ లా ముఖంపై ఐస్ మసాజ్ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఫేస్ ఐసింగ్ 15 రోజుల పాటు చేస్తే మీకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం..

రక్తప్రసరణలో మార్పు: ఐస్‌ను రోజూ ముఖంపై రుద్దితే రక్తప్రసరణ బాగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్త ప్రసరణ సజావుగా ఉంటే ముఖం మెరుస్తుంది

ముఖం వాపు: ఎవరి ముఖమైనా వాపు లేదా ఉబ్బినట్లు అనిపిస్తే.. అతను ఫేస్ కి ఐస్ ను రోజూ అప్లై చేయాలి. ముఖం లోపల ఉండే నాళాల వాపును తగ్గించడంలో ఐస్ సహాయపడుతుంది.

తాజాగా అనిపిస్తుంది: ముఖంపై కేవలం ఒక నిమిషం పాటు ఐస్‌ని రుద్దడం లేదా మసాజ్ చేయడం వల్ల కలిగే ఒక ప్రయోజనం ఏమిటంటే తాజా అనుభూతి చెందుతారు. చర్మంలో తాజాదనం కోసం మీరు ఈ చర్మ సంరక్షణ చిట్కాను ప్రయత్నించవచ్చు.

ముఖంపై ఇలా ఐసింగ్ చేయండి: మీరు నేరుగా ముఖంపై ఐస్‌ను రుద్దవచ్చు లేదా చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. అంతేకాదు పుదీనా, తులసి లేదా ఇతర మూలికలతో ఐస్ క్యూబ్‌లను తయారు చేసుకుని వాటితో ఫేస్ ఐసింగ్ చేయవచ్చు.