- Telugu News Photo Gallery Basmati Rice Export Curb: Centre Imposes curbs on basmati rice exports here is details
Basmati Rice Export Curb: కేంద్రం సాధారణ బియ్యంతో పాటు బాస్మతి ఎగుమతిపై నిషేధం
బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం సన్న బియ్యం ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. ఇప్పుడు అది నిర్ణీత ధర స్థాయి బాస్మతి బియ్యం ఎగుమతిని పరిమితం చేసింది. ప్రస్తుత నివేదిక ప్రకారం.. టన్నుకు 1,200 డాలర్లు (సుమారు రూ. లక్ష) కంటే ఎక్కువ ఎగుమతి ఒప్పందం ఉన్న బాస్మతి బియ్యం మాత్రమే ఎగుమతి చేయడానికి అనుమతించబడుతుంది..
Updated on: Aug 27, 2023 | 3:42 PM

నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయల ధరలు సైతం విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగే బియ్యం ధరలు సైతం ఆకాశాన్నంటాయి. సన్నబియ్యం క్వింటాలుకు దాదాపు వెయ్యి రూపాయల వరకు పెరిగిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి సన్న బియ్యం ధరను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే బియ్యంపై నిషేధిం విధిస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది.

బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం సన్న బియ్యం ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. ఇప్పుడు అది నిర్ణీత ధర స్థాయి బాస్మతి బియ్యం ఎగుమతిని పరిమితం చేసింది. ప్రస్తుత నివేదిక ప్రకారం.. టన్నుకు 1,200 డాలర్లు (సుమారు రూ. లక్ష) కంటే ఎక్కువ ఎగుమతి ఒప్పందం ఉన్న బాస్మతి బియ్యం మాత్రమే ఎగుమతి చేయడానికి అనుమతించబడుతుంది.

అంత కంటే తక్కువ ఉన్న బాస్మతి బియ్యం ఎగుమతిపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం మరింత పెరగడాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈసారి వానాకాలం వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వరి దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. అన్ని రకాల వరి ఉత్పత్తి తగ్గిపోయింది.

బాస్మతి మినహా ఇతర సాధారణ రకాల బియ్యం ఎగుమతిపై ప్రభుత్వం నిషేధం విధించింది. భారతదేశంలో తక్కువ ధరకు బాస్మతి బియ్యం ఎక్కువగా విక్రయించబడుతున్నందున దాని కొరత ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ఫలితంగా ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. దీంతో ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించింది.

ధరల పెరుగుదలను నిరోధించేందుకు ఉల్లితో సహా కొన్ని ఆహార పదార్థాల ఎగుమతిపై భారత్ ఆంక్షలు విధించింది. ఈ చర్య భారతదేశంలోని చాలా మంది వ్యాపారులు, రైతులకు ఆదాయాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఇది సామాన్యులకు ధరల పెరుగుదలను నిరోధిస్తుంది.




