తులసీ విత్తనాలు జలుబు, దగ్గు నుండి విముక్తి పొందడంలో సహాయపడుతుంది. తులసి గింజలను డికాక్షన్‌లో కలుపుకుని కూడా తీసుకొవచ్చు. ఈ డికాషన్ జలుబు, దగ్గు నుండి త్వరగా బయటపడటానికి సహాయపడుతుంది. ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫాన్ని బయటకు తీసేయటంలో ఇది పనిచేస్తుంది. మారుతున్న సీజన్లలో ఈ సమస్య తరచుగా ఎదురవుతుంటుంది. అటువంటి పరిస్థితుల్లో తులసి గింజలతో చేసిన కషాయాలను తరచూ తీసుకోవటం ఆరోగ్యానికి మేలు.
తులసి గింజల్లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ గింజలను తీసుకోవడం వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. శరీరానికి కావలసిన పోషకాలను (Nutrients) అందించి బరువును తగ్గించడానికి చక్కగా పనిచేస్తాయి.
తులసి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలను నివారిస్తుంది. మలబద్ధకం, అజీర్ణం, విరేచనాలను నివారించడానికి పనిచేస్తుంది. మీరు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలతో తులసి గింజలను తినవచ్చు.
తులసి గింజలను నమిలి తింటే దంతాలలో పేరుకుపోయిన బ్యాక్టీరియా నశించి దంత సమస్యలు (Dental Problems) దూరమవుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మెదడు పనితీరును మెరుగుపరచడానికి తులసి చక్కగా పనిచేస్తుంది. కాచి చల్లార్చిన నీటిలో తులసి రసాన్ని (Tulasi juice) కలుపుకుని ఉదయాన్నే పరగడుపున తాగడంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది.