
ఉదయం పూట అల్పాహారం కింద చాలా మంది మొదటి ఎంపికగా అరటిపండును ఎంచుకుంటారు. అరటిపండ్లను పాలు, కార్న్‌ఫ్లేక్స్‌తో లేదా బ్రెడ్‌తో కలిపి తింటే చాలా సమయం పాటు కడుపు నిండుగా ఉంటుంది. శరీరానికి కూడా చాలా మేలు చేస్తుంది. అరటిపండ్లు తింటే గుండెకు మంచిది. అంతే కాదు టైప్-2 డయాబెటిస్, కోలన్ క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో కూడా ఈ పండు సహాయపడుతుంది.

అరటిపండ్లలో విటమిన్-బి6 ఉంటుంది. ఇది ఎర్రరక్తకణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. అరటిపండ్లలో మాంగనీస్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అరటి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

Banana

నిజం కాదు. అరటిపండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది LDL లేదా చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

అరటిపండ్లలో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని విటమిన్లు, మినరల్స్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి. అరటిపండులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. అంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుతాయన్నమాట.