Bad Breath Remedies: నోటి దుర్వాసతో ఇబ్బంది పడుతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి

|

Feb 17, 2024 | 2:45 PM

కొందరిని బాగా ఇబ్బంది పెట్టేది నోటి దుర్వాసన ఒకటి.. అసలు ఏం తిన్నా తినకపోయినా కొందరి నోటినుంచి దుర్వాసన వస్తుంటుంది. దీంతో వీరు ఇతరులతో స్వేచ్ఛగా మాట్లాడలేరు. అయితే ఈ నోటి దుర్వాసనకు అనేక రకాల కారణాలున్నాయి. దంతాలు శుభ్రం చేసుకోకపోయినా, ఆరోగ్య సమస్యలున్నా నోటి నుంచి దుర్వాసన వస్తుంది. మరికొందరిలో కిడ్నీ సమస్యల కారణంగా చాలా మందికి నోటి దుర్వాసన వస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని రకాల ఆహారాలను తినడం వలన దంతాల మూలాల్లోని పేరుకున్న మురికి అంతా బయటకు వస్తుంది.. నోటి దుర్వాసనకు ఎలాంటి ఆహారాలు సహాయపడతాయి ఈ రోజు తెలుసుకుందాం.. 

1 / 8
ప్రతి ఒక్కరూ కొన్ని ప్రాథమిక పరిశుభ్రత నియమాలను పాటించాలి. పాదాలను శుభ్రం చేయడం నుంచి  ముఖం కడుక్కోవడం వరకూ ఈ నియమాల్లో ఉన్నాయి. రోజూ పళ్లు తోముకుని నోరు కడుక్కోకపోతే తిన్న  ఆహారం నోటిలో నిల్వ ఉండి ఆహరం కుళ్లిపోయి దుర్వాసన వస్తుంది. అక్కడ నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు

2 / 8
ఎవరికైనా సరే నోటి నుంచి దుర్వాసన వస్తే చాలా అసౌకర్యంగా ఉంటుంది. నోటి దుర్వాసన ఎదుటి వ్యక్తులను కూడా ఇబ్బంది పెడుతుంది. అంతేకాదు తమకు తామే ఇబ్బందిగా ఫీల్ అయ్యేటట్లు చేస్తుంది నోటి నుంచి వచ్చే చేడు వాసన. నోటి దుర్వాసన ఇతర వ్యాధులకు సూచన అని కూడా నిపుణులు చెబుతున్నారు. 

3 / 8
మీ గురించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. నోటిలో తిన్న ఆహారపదార్థాలు అంటుకుని అలా అక్కడే ఉండిపోతే కుళ్లిపోయి నోటి నుంచి దుర్వాసన వస్తుంది. దినచర్యలో కొన్ని నియమాలను పాటిస్తే నోటి దుర్వాసన సమస్యను దూరం చేస్తుంది. 

4 / 8
రోజువారీ తినే ఆహారంలో ఆపిల్, క్యారెట్లు చేర్చుకోండి. అంతేకాదు పండ్లు, కూరగాయలు దంతాలపై  పేరుకుపోయిన మురికిని తొలగిస్తాయి. నోటి దుర్వాసనను కూడా తొలగిస్తాయి. 

5 / 8
తినే ఆహారంలో క్యాల్షియం, ఫాస్పరస్‌ ఉండేలా చూసుకోవాలి. ఈ పదార్థాలన్నీ దంతాలను బలపరుస్తాయి. పెరుగు, పాలు, జున్ను క్రమం తప్పకుండా తినండి. కాల్షియం పంటి ఎనామిల్ ఏర్పడటానికి కూడా సహాయపడుతుంది. దంతాల నిర్మాణాన్ని నిర్వహించడంతోపాటు దంతాలను దృఢంగా ఉంచుతుంది

6 / 8
పాల కూరలో విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం ఉంటాయి. ఇందులో ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది చిగుళ్ల వ్యాధి ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన చిగుళ్ళను నిర్వహించడానికి సహాయపడుతుంది

7 / 8
నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడేవారు ఉల్లిపాయలు, వెల్లుల్లి, చేపలు, మాంసం తక్కువగా తినాలి. ఈ ఆహారాలన్నీ నోటి దుర్వాసనకు కారణమవుతాయి. కాబట్టి తక్కువగా తినండి. ఎక్కువ నీరు త్రాగండి. 

8 / 8
తిన్న వెంటనే నోటిని శుభ్రం చేసుకోవాలి. రాత్రిపూట పళ్ళు తోముకోవడం మొదలు పెట్టండి. చాక్లెట్లు తింటే వెంటనే నోటిని శుభ్రం చేసుకోవాలి. కొన్నిసార్లు ఆమ్లతత్వం కూడా దుర్వాసనకు కారణమవుతుంది. కనుక రాత్రి నిద్రపోయే ముందు నోటిని శుభ్రం చేసుకుని నిద్రపోవాలి.   