
ఎర్రని అందమైన పూల గుత్తులతో మోదుగ చెట్టు చూడటానికి ఏంతో అందంగా ఉంటుంది. మోదుగ పువ్వులు చిలక ముక్కు లాగా కొక్కెం లా ఉండి నారింజ రంగులో చూపరులకు కనువిందు చేస్తాయి. మోదుగ పూల పుప్పొడిని వినియోగించి హోలీ రంగులలో కలిపే పదార్ధాన్ని తయారు చేస్తారు. ఈ మోదుగ పూల ఆకులను అనేక పూజా కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు.

మోదుగా పూలు పరమ శివునికి ఏంతో ప్రీతికరమైనవిగా మన పూర్వీకులు చెప్పుకునేవారు. ఈ చెట్టు బెరడును ఎండబెట్టి దానిని హోమాలలొ ఉపయోగించే వారు. ఈ బెరడును కాల్చి ఇంట్లో ఉంచడం ద్వారా చెడు వాసన, దుర్గాంధము పోగొట్టవచ్చు. చెట్టు కలపను ప్యాకేజి బాక్సుల తయారీలలో కూడా వినియోగిస్తున్నారు.

మోదుగ పువ్వులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..ఆయుర్వేదంలో వీటిని అనేక వ్యాధులకు మందుగా ఉపయోగిస్తున్నారు. మోదుగ నూనె, ఆకులు, విత్తనాలను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి మోదుగ పూలు చాలా మంచిది. ఇది అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలను దూరం చేస్తాయి. మోదుగ విత్తనాల్ని పొడి చేసి దానిలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడేవారికి మోదుగ పువ్వుల మొగ్గలు చాలా మంచిదట. దీని పొడిని వాడితే చాలా వ్యాధులు నయమవుతాయని నిపుణులు చెబుతున్నారు. మోదుగ చెట్టు బెరడు డయేరియాను నివారిస్తుందట. దీని గింజలు క్రిమిసంహారకంగా పనిచేస్తాయి. ఆకలిని కూడా పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

మోదుగ పువ్వు నిద్ర సమస్యలను దూరం చేస్తుందట. మోదుగ ఆకుల రసం తాగితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో చాలా మందికి చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. మోదుగ పువ్వుల గింజల పొడిని వాడితే దురద తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మోదుగ పూలు కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

మోదుగ పువ్వులో విటమిన్ సి, కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్ల లాంటి పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తాన్ని శుద్ధి చేయడానికి మోదుగ చెట్టు బెరడు బాగా ఉపయోగపడుతుంది. రక్తం శుద్ధి అయితే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.